`జబర్దస్త్` లవర్స్ కి గుండె పగిలే వార్త.. ఇకపై ఆ షో క్లోజ్‌.. ఉండేదెవరు, పోయేదెవరు?

Published : May 28, 2024, 08:19 PM IST

జబర్దస్త్ రెండు కామెడీ షోలు పదేళ్లుగా నవ్వులు పూయిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ షోలకు సంబంధించిన ఓ గుండె పగిలే వార్త బయటకు వచ్చింది. ఓ షో ఆగిపోతుంది.   

PREV
16
`జబర్దస్త్` లవర్స్ కి గుండె పగిలే వార్త.. ఇకపై ఆ షో క్లోజ్‌.. ఉండేదెవరు, పోయేదెవరు?

జబర్దస్త్ కామెడీ షోలు గత పదేళ్లుగా తెలుగు ఫ్యామిలీల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ప్రారంభంలో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు అనే విమర్శలు వచ్చినా, ఆ తర్వాత ఆ షోనే జనం ఆదరించారు. బ్రహ్మరథం పట్టారు. టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్‌ ఇచ్చారు. పదేళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది ఈ జబర్దస్త్ షో. రెండు భాగాలుగా వచ్చే ఈ కామెడీ తెలుగు రాష్ట్రాల్లో ఇంటిళ్లిపాదిని అలరిస్తున్నాయి. నవ్వులు పూయించాయి. 
 

26

కానీ గత కొంత కాలంగా షోలో నిలకడ లేదు. రెండు జబర్దస్త్ షోస్‌లోనూ యాంకర్లు, జడ్జ్ లు, స్టార్‌ కమెడియన్లు మారిపోతూ వస్తున్నారు. దీంతో అప్పట్నుంచి కొంత కళ తప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. మునుపటి కిక్‌, కామెడీ రావడం లేదనే భావన చాలా మందిలో కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుంది మల్లెమాల నిర్వాహకులు పెద్ద షాక్‌ ఇచ్చారు. జబర్దస్త్ లవర్స్ కి గుండె పగిలే వార్త చెప్పారు. 
 

36

చాలా రోజులుగా ఓ వార్త వినిపిస్తూనే ఉంది. రెండు షోలు(జబర్దస్త్, ఎక్ట్సా జబర్దస్త్)లో ఒక దాన్ని తీసేస్తున్నారని, ఆ స్థానంలో మరో షోని తీసుకురావాలనే ఆలోచనలో మల్లెమాల టీమ్‌ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే చేస్తుంది టీమ్‌. ఒక షోని క్లోజ్‌ చేస్తున్నారు. రెండు షోలలో `ఎక్ట్స్రా జబర్దస్త్` షోని క్లోజ్‌ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో ఆ విషయాన్ని తెలియజేసింది టీమ్‌. 
 

46

రామ్‌ ప్రసాద్‌ తన స్కిట్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఇక్కడ రెండు కంపెనీలున్నాయి. ఇప్పుడు రెండు కలిపి ఒక్కటి కాబోతుంది. ఒకటి మిస్‌ అవుతున్నందుకు బాధగా ఉంది. మొదట్నుంచి ఇందులోనే ఉన్నాను, అదే వెళ్లిపోతుండటంతో చాలా బాధగా ఉందని రామ్‌ ప్రసాద్‌ ఎమోషనల్‌ అయ్యాడు. దీంతో అటు యాంకర్‌ రష్మి, నరేష్‌, కృష్ణభగవాన్‌, ఖుష్బూ ఇలా అంతా కన్నీళ్లు పెట్టుకున్నాడు. భావోద్వేగానికి గురయ్యారు. 
 

56

ఇకపై నుంచి జబర్దస్త్ షో మాత్రమే ఉంటుంది. రెండింటిని కలిపి ఒకే షోగా టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇది హార్ట్ బ్రేక్‌ అయ్యే వార్త అంటే, ఇందులో ఓ ట్విస్ట్ పెట్టారు. ఈ ఒక్క షోనే రెండు రోజులు ప్రసారం చేయబోతున్నారు. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రాజబర్దస్త్ ఉండేది. ఇప్పుడు శుక్రవారం, శనివారం జబర్దస్త్ ని ప్రసారం చేయబోతున్నట్టు యాంకర్‌ రష్మి తెలిపారు. అంటే ఒకే షోని రెండు సగం ఒక రోజు, మరో సగం మరో రోజు ప్రసారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 
 

66

ఇదిలా ఉంటే ఇటీవల జబర్దస్త్ షో నుంచి జడ్జ్ ఇంద్రజ వెళ్లిపోతున్నట్టు ఆ షో ప్రోమోలో వెల్లడించారు. రెండు ఒకటి కాబోతున్న నేపథ్యంలో ఖుష్బూని ఉంచి ఇంద్రజని పంపిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే యాంకర్‌ రష్మి కంటిన్యూ అవుతారని, మరో యాంకర్‌ సిరి వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతోపాటు మిగిలిన కామెడియన్లు అంతా ఉంటారని టాక్‌. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మున్ముందు క్లారిటీ రాబోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories