'సీతా రామం'లో కాపీ కొట్టిన సీన్స్ అవేనా ?.. హంబుల్ గా కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..

First Published Sep 18, 2022, 5:39 PM IST

సీతా రామం చిత్రంతో ప్రేక్షకులకి మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేశారు డైరెక్టర్ హను.

సీతా రామం చిత్రంతో ప్రేక్షకులకి మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేశారు డైరెక్టర్ హను. ఈ దర్శకుడు తెరకెక్కించిన గత చిత్రాలు లై, పడి పడి లేచే మనసు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. కానీ హను ట్యాలెంట్ ని మాత్రం ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. అందుకే అశ్విని దత్ వైయంతి లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో సినిమా చేసే అవకాశం హను రాఘవపూడి కి దక్కింది. 

వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ సీతా రామం చిత్రాన్ని దృశ్య కావ్యంగా మలిచాడు. హృదయాల్ని కదిలించే క్లాసిక్ ప్రేమ కథగా ఈ చిత్రం ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం గా నిలిచింది. సైనికుడిగా దుల్కర్ సల్మాన్ నటన , ప్రిన్సెస్ గా మృణాల్ ఠాకూర్ పెర్ఫామెన్స్.. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. 

హను రాఘవపూడి ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నారు. అలాగే ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో ఓ చిత్రం నుంచి కాపీ చేశారని కొందరు ట్రోల్ కూడా చేస్తున్నారు. అలాగే వెంకటేష్ మల్లీశ్వరి చిత్రం నుంచి కూడా కొన్ని సీన్స్ కాపీ అయ్యాయి అంటూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ హనుని విమర్శిస్తున్నారు. 

మల్లీశ్వరి చిత్రంలో కూడా హీరోయిన్ ప్రిన్సెస్ గా నటించింది. ఆమె ప్రిన్సెస్ అనే సంగతి హీరోకి తెలియదు. దీనితో తన జీతంతో సొంత ఇల్లు కొనుక్కుందాం అని చెబుతాడు. ఇదే తరహా సీన్స్ సీత రామంలో కూడా ఉన్నాయి. 

ఆ సన్నివేశాలు యాదృచ్చికంగా రాసుకున్నవే తప్ప కాపీ కొట్టాల్సిన అవసరం లేదని హను స్పందించారు. అయినా అంత మంచి మూవీతో తన చిత్రాన్ని పోల్చినందుకు ట్రోలర్స్ కి థ్యాంక్స్ చెప్పి సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు. 

సౌత్ లో సూపర్ హిట్ ఐన తర్వాత ఇటీవల ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం విజయం సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అదరగొడుతోంది. 

click me!