హన్సిక పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్.. యువరాణిలా వెలిగిపోతున్న యాపిల్ బ్యూటీ

First Published Dec 10, 2022, 4:18 PM IST

ప్రస్తుతం హన్సిక, సోహైల్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా హన్సిక పోస్ట్ వెడ్డింగ్ షూట్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. దీనితో హన్సిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ప్రస్తుతం హన్సిక, సోహైల్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా హన్సిక పోస్ట్ వెడ్డింగ్ షూట్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హన్సిక రాయల్ లుక్ లో యువరాణిలా వెలిగిపోతోంది. 

దీపాల వెలుగుల్లో హన్సిక చిరునవ్వులు చిందిస్తూ సోహైల్, ఇతర ఫ్యామిలీ సభ్యులతో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బిజినెస్ పార్ట్నర్ గా సోహైల్ హన్సిక కి పరిచయం అయ్యాడు.  సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. సోహైల్ కి ఆల్రెడీ వివాహం జరిగింది. అతడికి ఇది రెండవ వివాహం. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.

ఆసక్తికర విషయం ఏంటంటే రింకీ, హన్సిక బెస్ట్ ఫ్రెండ్స్. రింకీ, సోహైల్ వివాహానికి కూడా హన్సిక హాజరైంది. ఇప్పుడు తన స్నేహితురాలి మాజీ భర్తనే హన్సిక వివాహం చేసుకుంది. 

click me!