హన్సికా షాకింగ్ వర్కౌట్.. జిమ్ లో ఇంతా హెవీగా చేస్తోందేంటీ.!

First Published | Oct 20, 2023, 2:57 PM IST

సీనియర్ నటి హన్సికా మోత్వానీ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా తన ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టి బెస్ట్ అవుట్ ఫుట్ కోసం కావాల్సినంతగా శ్రమిస్తోంది. 
 

తొలిచిత్రం ‘దేశముదరు’తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది స్టార్ బ్యూటీ హన్సికా మోత్వానీ (Hansika Motwani).  తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే కంత్రి, మస్కా, బిల్లా, కందిరీగ, హో మై ఫ్రెండ్, వపర్, గౌతమ్ నంద లాంటి సినిమాలతో మరింతగా మెప్పించింది. 
 

బాలనటిగానే కెరీర్ ను ప్రారంభించిన హన్సికా... హృతిక్ రోషన్ ‘ఖోయి మిల్ గయా’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత నాలుగేళ్లకే హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆశ్చర్యపరిచింది. తన పెర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది. 
 


టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందింది. అలాగే తమిళంలోనూ చాలా సినిమాలు చేసి మెప్పించింది. కొన్ని హిందీ చిత్రాలతోనూ అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 
 

ఈ సందర్భంగా విభిన్న పాత్రలను పోషిస్తోంది. తన రోల్ కు న్యాయం చేసేందుకు తనవంతుగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఫిట్ నెస్ విషయంలోనూ ఏమాత్రం రాజీపడటం లేదు. రోజువారీగా హెవీ వర్కౌట్స్ చేస్తూ వస్తోంది. తాజాగా తన జిమ్ సెషన్ కు సంబంధించి వీడియో ఫొటోలను పంచుకుంది.
 

రాడ్ ను చేతులతో పట్టుకొని తలకిందులాగా వేళాడుతూ షాక్ ఇచ్చింది. అలాగే కాళ్ల సాయంతో రాడుకు వేళాడుతూ ఏబీఎస్ వర్కౌట్ చేసి ఆశ్చర్యపరిచింది. బాడీ బిల్డర్స్ చేసే కొన్ని రకాల ఎక్స్ ర్ సైజ్ లు చేస్తూ కనిపించింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

ఇక హన్సికా తన పెళ్లికి ముందే నాజుగ్గా తయారైన విషయం తెలిసిందే. తాజాగా ఇలా తన వర్కౌట్ వీడియోలు, ఫొటోలను పంచుకోవడంతో అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఫిట్ నెస్ లవర్స్ కు స్ఫూర్తిగానూ నిలిచిందంటున్నారు. ఇక హన్సికా తమిళం, తెలుగులో మొత్తంగా ఐదు చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!