హాన్సిక బర్త్ డే.. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న తల్లి.. ఫోటోలు వైరల్‌

Published : Aug 09, 2021, 10:29 AM IST

పాల బుగ్గల సుందరి హన్సిక బర్త్ డే చేసుకుంటోంది. నేడు(ఆగస్ట్ 9) హన్సిక తన 30వ పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.   

PREV
114
హాన్సిక బర్త్ డే.. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న తల్లి.. ఫోటోలు వైరల్‌

హన్సిక తెలుగు, తమిళంలో టాప్‌ హీరోయిన్‌గా రాణించారు. ఇప్పుడు కాస్త సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న ఈ పాల బుగ్గల సుందరి సోమవారం పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటుంది. 

214

అయితే తనకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ హన్సికని సర్‌ప్రైజ్‌ చేశారు. బెలూన్స్ తో రూమ్‌లో అందంగా డెకరేట్‌ చేసి ఆమెని ఆశ్చర్యానికి గురి చేశారు. 
 

314

తన పుట్టిన రోజుకి సంబంధించి వారంతా అందంగా ముస్తాబు చేయగా, సడెన్‌గా చూసిన హన్సిక ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. 
 

414

కేక్‌ కట్‌ చేసి తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి తినిపిస్తూ సంతోషం వ్యక్తం చేసింది హన్సిక. అంతేకాదు వారితో ఫోటోలకు పోజులిస్తూ రోచ్చిపోయింది. 

514

బ్లాక్‌ టైట్‌ డ్రెస్‌లో హోయులు పోయింది హన్సిక. ఈ సందర్భంగా హన్సిక తన బర్త్ డే వీడియోలను, ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవిప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

614

అయితే ఇందులో హన్సిక మదర్‌ మోనా పండగా చేసుకుంది. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఆమె పార్టీ చేసుకోవడం విశేషం. అన్నింటి కంటే ఈ వీడియో సోషల్‌ మీడియాలో మరింతగా ఆకట్టుకుంటున్నాయి. 

714

మహారాష్ట్రకి చెందిన హన్సిక చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ని ప్రారంభించింది. హన్సిక ఫ్యామిలీ సింధీ కుటుంబానికి చెందనది. తండ్రి ప్రదీప్‌ మోత్వాని బిజినెస్‌ మ్యాన్‌, తల్లి మోనా డెర్మటాలజిస్ట్. 

814

ముంబయిలోని పోడార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్టడీ చేసింది. ఆ సమయంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుంది. `దేశ్‌ మెయిన్‌ నిక్లా హోగా చంద్‌` సీరియల్‌లో నటించే ఆఫర్‌ వచ్చింది. 

914

ఇలా వరుసగా ఆమె ఐదేళ్లపాటు దాదాపు ఏడు సీరియల్స్ లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపుని పాపులారిటీని తెచ్చుకుంది. వీటితోపాటు `హవా` అనే చిత్రంతో సినిమా ఎంట్రీ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్టుగా `కొయి మిల్‌ గయా`, `ఆబ్రా క దాబ్రా`, `జాగో`, `హమ్‌ కౌన్‌ హై` వంటి హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. 

1014

ఈ క్రమంలోనే 2007లో అల్లు అర్జున్‌తో `దేశముదురు` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైంది. పూరీ ఈ మిల్కీ భామని హీరోయిన్‌గా పరిచయం చేశారని చెప్పొచ్చు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఒక్కసారిగా క్రేజీ భామగా మారిపోయింది హన్సిక. తెలుగులో, హిందీ, కన్నడ,తమిళంలో వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. 
 

1114

ప్రధానంగా తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత తమిళంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తో `కంత్రి`, రామ్‌తో `మస్కా`, ప్రభాస్‌తో `బిల్లా`, కళ్యాణ్‌ రామ్‌తో `జయీభవ`, `సీతారాముల కళ్యాణం`, రామ్‌తో `కందిరీగ`, సిద్ధార్థ్‌ తో `ఓ మై ఫ్రెండ్‌`, మంచు విష్ణుతో `దేనికైనా రెడీ`, `లక్కున్నోడు`, రవితేజతో`పవర్‌`,  గోపీచంద్‌తో`గౌతమ్‌ నందా`, సందీప్‌ కిష్‌తో`తెనాలి రామకృష్ణ`చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. 

1214

ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `మహా` విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.

1314

అందులో `105మినిట్స్` అనే సింగిల్‌ షాట్‌ మూవీ ఉండగా, మరోటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `మై నేమ్‌ ఈజ్‌ శృతి` ఉన్నాయి. దీంతోపాటు `పార్ట్నర్‌` అనే తమిళ చిత్రంలోనూ నటిస్తుంది.
 

1414

ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్న సందర్భంగా హన్సిక తల్లి మోనా సంతోషం. కూతురు కంటే ఆమెనే ఎక్కువగా ఎంజాయ్‌ చేశారని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories