మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ చేయాల్సింది `గుంటూరు కారం` కాదా?.. ముందు అనుకున్నది వేరే? వీడియో చూపిస్తూ ర్యాగింగ్‌

Published : Jan 24, 2024, 07:48 AM IST

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంక్రాంతికి `గుంటూరు కారం` సినిమా వచ్చింది. కానీ ఇది ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. చాలా ట్రోలింగ్‌కి గురయ్యింది. ఇప్పుడు మరో రకమైన ర్యాగింగ్‌ జరుగుతుంది. 

PREV
16
మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ చేయాల్సింది `గుంటూరు కారం` కాదా?.. ముందు అనుకున్నది వేరే? వీడియో చూపిస్తూ ర్యాగింగ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `అతడు`, `ఖలేజా` తర్వాత వచ్చిన చిత్రమిది. చాలా గ్యాప్‌ తో ఈ కాంబో సెట్‌ కావడంతో సినిమా అదిరిపోతుందని, ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో విపరీతమైన నెగటివిటీ జరిగింది, ట్రోల్‌ చేశారు. అది మరింత ఎఫెక్ట్ అయ్యింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ కాలేదని అంటున్నారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. కానీ ఈ మూవీని మహేష్‌ బాబు ఫ్యాన్స్ కూడా ట్రోల్‌ చేయడం గమనార్హం. 
 

26
Mahesh Babu

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ప్రూప్‌లు కూడా చూపిస్తున్నారు. అసలు మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో చేయాల్సిన సినిమా `గుంటూరు కారం` స్టోరీ కాదా. అది వేరే అని తెలుస్తుంది. మహేష్‌కి త్రివిక్రమ్‌ చెప్పిన స్టోరీ వేరే. అది చాలా యాక్షన్‌తో ఉంటుందని, నెక్ట్స్ లెవల్‌ స్టోరీ అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన సినిమా ప్రకటనలోనూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో.. త్రివిక్రమ్‌, మహేష్‌ బాబు, ఫైట్‌ మాస్టర్స్ అన్బరివ్‌లు కలిసి షూటింగ్‌లో ఉన్న దృశ్యాలను చూపిస్తూ సినిమా వీడియోని విడుదల చేశారు. 

36

అందులో `ఎస్‌ఎస్‌ఎంబీ28 హై ఆక్టేన్‌ ఎంటర్‌టైనర్‌` అని ట్యాగ్‌ లైన్‌ ఇచ్చారు. బీజీఎం కూడా వేరే లెవల్‌లో ఉంది. త్రివిక్రమ్‌ కూడా అదే కథతో సినిమాని ప్రారంభించారట. విదేశాల్లో కొంత భాగం షూట్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. కానీ ఆ తర్వాత మహేష్‌ బాబు ఈ ప్రాజెక్ట్ వద్దని చెప్పినట్టు తెలుస్తుంది. ఇది వర్కౌట్‌ కాదని చెప్పడంతో దాన్ని పక్కన పెట్టారట. ఆ సమయంలో ఫైట్స్ బాగా రాలేదని, మార్చాలని చర్చలు జరిగినట్టు, దర్శకుడు, హీరోకి మధ్య వాగ్వాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అది దీనికోసమే అని తెలుస్తుంది. కంప్లీట్‌గా ఆ స్టోరీని పక్కన పెట్టినట్టు సమాచారం. 
 

46

అయితే మహేష్‌ డేట్స్ ఉండటంతో ఈ లోపు వేరే ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని, అప్పుడు త్రివిక్రమ్‌ ఇప్పుడు తీసిన `గుంటూరు కారం` స్టోరీ చెప్పారట. అది మహేష్‌బాబుకి నచ్చింది. దీంతో ఈ సినిమాని పట్టాలెక్కించారు. తల్లికొడుకు సెంటిమెంట్‌కి కనెక్ట్ అయ్యాడు మహేష్‌. అలా `గుంటూరు కారం`(హై ఇన్‌ఫ్లేమబుల్‌) మూవీ వచ్చింది. కానీ ముందు అనుకున్నది `హై ఆక్టేన్‌ ఎంటర్‌టైనర్‌). ఇలా మొత్తం మారిపోయింది. కానీ రిజల్ట్ తేడా కొట్టింది. ముందు అనుకున్న స్టోరీ తీస్తే ఫలితం ఎలా ఉండేదో. 

56

కానీ ఇప్పుడు దీనిపై ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఓరకంగా ర్యాగింగ్‌ అని చెప్పొచ్చు. మొదట్లో ప్రకటించిన వీడియో క్లిప్పుని చూపిస్తూ ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అని నిర్మాణ సంస్థలను ప్రశ్నిస్తున్నారు. నెక్ట్స్ ఇది ఉంటుందా? అని అడుగుతున్నారు. కొందరైతే రాజమౌళి మూవీ తర్వాత ఇదే పట్టాలెక్కుతుందని, ఎస్‌ఎస్‌ఎంబీ30 అంటున్నారు. ఆల్‌రెడీ షూటింగ్‌ జరుగుతుందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇలా చిలిపిగా ర్యాగింగ్‌ చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్పులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

66

మహేష్‌ బాబు, శ్రీలీల జంటగా నటించిన `గుంటూరు కారం`లో మహేష్‌ కి తల్లిగా రమ్యకృష్ణ నటించింది. ప్రకాజ్‌ రాజ్, జగపతిబాబు, జయరాం, ఈశ్వరీరావు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదలై దాదాపు రెండు ముప్పై కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. అయితే చాలా ఏపీలో చాలా చోట్ల బ్రేక్ ఈవెన్‌ అయ్యిందని, నైజాం, ఓవర్సీస్‌లో కొంత నస్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories