టాలీవుడ్ లో గతంలో కథల విషయంలో అనేక వివాదాలు చూశాం. తమ కథని కాపీ చేశారని రచయితలు వాపోవడం, కంప్లైంట్ చేయడం లాంటి సంఘటనలు చూశాం. అయితే గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ హిరణ్య కశ్యప విషయంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. హిరణ్య కశ్యప అనేది పురాణ గాధతో తెరకెక్కించాలనుకున్న చిత్రం. పురాణాలపై చిత్రాలు ఎవరైనా తెరకెక్కించుకోవచ్చు. రామాయణం, మహాభారతం కథలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. దర్శకులు ఎవరి కోణాల్లో వారు ఆ కథలని ఆవిష్కరించారు.