క్యూట్‌ లుక్‌లో కట్టిపడేస్తున్న రష్మిక మందన్నా.. మేకప్‌ లేకుండా నేషనల్‌ క్రష్‌ ఇంత అందంగానా?

Published : Nov 14, 2022, 08:10 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హాట్‌ డోస్‌ పెంచుతూ షాక్‌ ల మీద షాకులిస్తున్న విషయం తెలిసిందే. తన అందాలను ఓపెన్‌గా ఆవిష్కరిస్తూ మరింతగా రెచ్చిగొడుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు క్యూట్‌ లో కట్టిపడేస్తుంది.   

PREV
16
క్యూట్‌ లుక్‌లో కట్టిపడేస్తున్న రష్మిక మందన్నా.. మేకప్‌ లేకుండా నేషనల్‌ క్రష్‌ ఇంత అందంగానా?

రష్మిక మందన్నా హాట్‌ డోస్‌ కాదు, క్యూట్‌ లుక్‌లోకి మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ తన క్యూట్‌ ఫోటోలను పంచుకుంది. మేకప్‌ లేకుండా సహజమైన అందాలను చూపించింది. స్పెట్స్ పెట్టుకుని చిలిపిగా నవ్వుతూ దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది రష్మిక మందన్నా. ఇది తెగ ఆకట్టుకుంటుంది. 
 

26

రష్మిక మేకప్‌ లేకపోయినా అందం మాత్రం తరగలేదు కదా, మరింత అందంగా, మరింత క్యూట్‌గా కనిపించడం విశేషం. దీంతో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదేకాదు, రెండు రోజులుగా తన క్యూట్‌ ఫోటోలను షేర్ చేస్తుంది రష్మిక మందన్నా. 

36

ఆరేంజ్‌ కలర్‌ డ్రెస్‌లో సైడ్‌గా కొంటెగా చూస్తూ అలరిస్తుంది. ఈ పిక్‌ సైతం నెట్టింట చక్కర్లు కొడుతూ, ఆమె అభిమానులను కట్టిపడేస్తుంది. మరోవైపు స్టెప్స్ పై కూర్చొన్ని మరో ఫోటో సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. 

46

ఇవన్నీ పక్కన పెడితే లేటెస్ట్ గా ఆమె తన పెట్‌ డాగ్‌తో దిగిన ఫోటోని పంచుకుంది. చిల్ర్డన్స్ డే సందర్భంగా ఆమె ఓ నోట్‌ని పంచుకుంది. తాను చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు బాలల దినోత్సవం ఎలా జరుపుకునేవాళ్లమో తనకు ఇంకా గుర్తుందని, అయితే ఆ దినోత్సవ ప్రత్యేకత తెలియక ముందే చాలా వేగంగా పెరిగామని చెప్పింది. 
 

56

ఇన్ని ఏళ్లలో తాను నేర్చుకున్నది ఏంటంటే జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని పేర్కొంది. అందరు దయ, సంతోషం, ఆశ, ప్రేమతో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ బాలల దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది రష్మిక మందన్నా. 
 

66

రష్మిక మందన్నా బిజీ యాక్ట్రెస్‌గా ఉంది. ఆమె తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమె `పుష్ప 2`లో నటిస్తుంది. హిందీలో `యానిమల్‌` సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో `వారసుడు` చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు తమిళంలో మరో సినిమా చేస్తుంది రష్మిక. బిజీ పాన్‌ ఇండియా హీరోయిన్‌గా దూసుకుపోతుంది. మరోవైపు గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఆమె పంచుకునే ఫోటోలు అటు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూ, ఇటు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories