ఈ రోజు ఎపిసోడ్ లో అఖిల్, ఆనందంతో బయటికి వచ్చి రామని హగ్ చేసుకొని థాంక్స్ చెప్పగా మీ వదినకు చెప్పు అనడంతో థాంక్స్ అని చెప్పి అక్కడ సంతకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు జ్ఞానాంబ కుంటుంబం మొత్తం అఖిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మల్లిక కావాలనే దెప్పిపొడుస్తూ అసలు అఖిల్ ని తీసుకు వస్తుందో లేదో జానకి కేసు విత్ డ్రా చేసుకుంటుందో లేదో అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు విష్ణు మల్లిక పై సీరియస్ అవుతాడు. అప్పుడు జెస్సి ఆలోచనలో పడుతుంది.