Gopichand Flop Movies: ఆరడుగుల కటౌట్, మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ గోపీచంద్ ఎందుకనో విజయాల వేటలో వెనుకబడిపోతున్నాడు. సౌఖ్యం తర్వాత గోపీచంద్ కి సరైన హిట్ లేదు.
Gopichand Flop Movies: ఆరడుగుల కటౌట్, మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ గోపీచంద్ ఎందుకనో విజయాల వేటలో వెనుకబడిపోతున్నాడు. సౌఖ్యం తర్వాత గోపీచంద్ కి సరైన హిట్ లేదు. సౌఖ్యం తర్వాత గోపీచంద్ 10 చిత్రాల్లో నటించాడు. ఒక్క చిత్రానికి కూడా హిట్ ముద్ర పడలేదు. గోపీచంద్ లాంటి హీరోకి ఇలా జరగడం దురదృష్టమే. అయితే గోపీచంద్ చేసుకున్న తప్పిదాలు కూడా ఉన్నాయి.
25
Gopichand Movies
గోపీచంద్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకులని వెతికి పట్టుకోలేకున్నారు. ఫ్లాప్ చిత్రాలు ఇచ్చిన దర్శకులకే గోపీచంద్ అవకాశాలు ఇస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా గోపీచంద్ కి వరుసగా ఫ్లాప్ చిత్రాలే ఎదురవుతున్నాయి.
35
Gopichand Flop movies
గౌతమ్ నందా చిత్రం పర్వాలేదు కానీ వసూళ్లు రాలేదు. ఆక్సిజన్, పంతం, చాణిక్య, సీటిమార్, ఆరడుగుల బులెట్, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా, విశ్వం ఇలా అన్ని చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే తన తదుపరి చిత్రాల విషయంలో కూడా గోపీచంద్ జాగ్రత్త వహించడం లేదు.
45
గోపీచంద్ తన నెక్స్ట్ మూవీస్ కోసం ముగ్గురు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఘాజి చిత్రంతో సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి ఆ తర్వాత అంతరిక్షం, ఐబి 71 చిత్రాలతో ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు. ఈ దర్శకుడికి గోపీచంద్ ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రియలిస్టిక్ అంశాలతో సంకల్ప్ రెడ్డి వైవిధ్యమైన కథ సిద్ధం చేశారట.
55
సంకల్ప్ రెడ్డితో పాటు మరో ఇద్దరు దర్శకులకు గోపీచంద్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిలో రాధే శ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ ఒకరైతే మరొకరు సంపత్ నంది. వీళ్ళిద్దరూ గోపీచంద్ తో ఆల్రెడీ సినిమాలు చేసిన దర్శకులే. అయితే వీళ్లిద్దరి చివరి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. సంపత్ నంది గోపీచంద్ తో గౌతమ్ నంద, సీటీ మార్ చిత్రాలు తెరకెక్కించారు. రాధాకృష్ణ అయితే జిల్ చిత్రం రూపొందించారు. మరి ఈ ముగ్గురు దర్శకులు గోపీచంద్ కెరీర్ ని ఎటు తీసుకెళతారో చూడాలి.