హీరో గోపీచంద్ అంటే ఫ్యాన్స్ కి గుర్తొచ్చేది ఆరడుగుల కటౌట్. కెరీర్ బిగినింగ్ లో విలన్ రోల్స్ చేసిన గోపీచంద్ ఆ తర్వాత హీరోగా మారాడు. జయం, వర్షం చిత్రాల్లో గోపీచంద్ చేసిన విలన్ పాత్రలు అద్భుతంగా పండాయి. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా మారి యజ్ఞం, రణం, లౌక్యం లాంటి హిట్స్ అందుకున్నాడు.
26
అయితే ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ కాస్త ఆందోళనకరంగా మారింది . గోపీచంద్ రీసెంట్ గా నటించిన భీమా చిత్రానికి కూడా థియేటర్స్ లో రెస్పాన్స్ సోసో గానే ఉంది. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గోపీచంద్ మాస్ ఇమేజ్ పైనే తెరకెక్కించారు. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అవి ఆకట్టుకోలేదు.
36
దీనితో గోపీచంద్ చేసే యాక్షన్ సన్నివేశాలే ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే సినిమాని కాపాడలేవు. గోపీచంద్ కి గత పదేళ్లలో నిఖార్సైన హిట్ ఒక్కటి కూడా లేదు. పదేళ్ల నుంచి గోపీచంద్ చేస్తున్న తప్పు ఇదే. తన ఆరడుగుల కటౌట్ కి తగ్గట్లుగా కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టేసి నాసిరకం కథతో వచ్చేస్తున్నాడు.
46
గోపీచంద్ లాంటి హీరో ఫైట్స్ చేస్తుంటే బావుంటుంది. కానీ మాస్ తో పాటు కథ కూడా వైవిధ్యంగా ఉండాలి. ఈ తప్పుని సరిచేసుకోకుంటే గోపీచంద్ కెరీర్ డైలమాలో పడ్డట్లే అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సౌఖ్యం తర్వాత గోపీచంద్ కి ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు.
56
గౌతమ్ నంద, ఆక్సిజన్, పంతం, చాణక్య, సీటీ మార్, ఆరడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్, రామబాణం లేటెస్ట్ గా భీమా .. ఇవన్నీ ఎలాంటి వైవిధ్యం లేని రొటీన్ కమర్షియల్ చిత్రాలు. ఫ్లాపులు ఎదురవుతున్నా గోపీచంద్ మాత్రం కొత్తగా ట్రై చేయడం లేదు అనే విమర్శ ఎదురవుతోంది.
66
గోపీచంద్ తన కెరీర్ లో సాహసం లాంటి చిత్రం కూడా చేశాడు. మాస్ చిత్రాల హవా సాగుతున్న రోజుల్లో వచ్చిన ఆ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఇప్పుడు ఆడియన్స్ అలాంటి విభిన్నమైన కంటెంట్ కోరుకుంటున్నారు. సాహసం లాంటి మూవీ ఇప్పుడు పడితే పక్కాగా హిట్ గ్యారెంటీ అని అంటున్నారు. మరి గోపీచంద్ మూస మాస్ చిత్రాలు పక్కన పెట్టి కొత్తగా ట్రై చేస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్నాడు.