ఇంటర్నేషనల్ లెవల్లో ‘గూఢచారి 2’.. జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు.. సూపర్ అప్డేట్ ఇచ్చిన అడివి శేషు

First Published | Aug 3, 2023, 5:28 PM IST

టాలెంటెడ్ హీరో అడివి శేషు నెక్ట్స్  ఫిల్మ్ G2. భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీపై సూపర్ అప్డేట్ అందించారు. అంతర్జాతీయ స్థాయిలో మూవీ ఉండబోతుందంటూ ఆసక్తికరంగా అప్డేట్ ఇచ్చారు. 
 

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదనే చెప్పాలి. చేసిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుంటున్నారు. ముఖ్యంగా కాప్ రోల్స్ లో అదరగొడుతున్నారు. 
 

అయితే 2018లో వచ్చి న ‘గుఢచారి’తో అడివిశేష్ సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘రా’ ఏంజెంట్ గా అద్భుతంగా నటించి మెప్పించారు. సినిమా కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందకపోయినా.. ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుందీ చిత్రం.


దీంతో ప్రస్తుతం అడివి శేషు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసారి మరింత గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్పైగా శేషు అలరించబోతున్నారు. G2 టైటిల్ తో సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్, ప్రీ విజన్ గ్రాండ్ గా ఉంది. ఆడియెన్స్  లోనూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఆ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ అందలేదు. ఇక తాజాగా అడివి శేషు స్వయంగా సూపర్ న్యూస్ చెప్పారు. 
 

ఈ రోజుతో ‘గుఢచారి’ విడుదలై ఐదేళ్లు పూర్తైంది. దీంతో సినిమా సక్సెస్ ను శేషు గుర్తు చేసుకున్నారు. ట్వీటర్ వేదికన దర్శఖుడు శశికిరణ్ తిక్క, టెక్నీకల్ టీమ్, యూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈసారి G2తో వస్తున్నామన్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు మూడు దేశాల్లో జరుగుతున్నాయని తెలిపారు. అది పూర్తి కాగానే సెట్ లోకి అడుగుపెట్టబోతున్నామన్నారు. Agent 116 గా శేషు డూటీలో జాయిన్ కాబోతున్నారని అప్డేట్ ఇచ్చారు. 
 

సౌత్ ఇండియన్ సినిమాల్లో స్పై జోనర్ లో ‘గూఢచారి’ G2తో మళ్లీ తిరిగి వస్తుందని చెప్పారు. ఈసారి కేవలం యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలే కాకుండా.. ఊహకందని అంశాలతో రాబోతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ స్థాయికి చేరుకునేలా ‘జీ2’ ఉంటుందని తెలిపారు. శేషు ఇచ్చిన అప్డేట్ తో సినిమా పై మరింతగా హైప్ క్రియేట్ అయ్యింది. 

ఇక త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని అర్థం అవుతోంది. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినేడి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలో అందించనున్నారు. ఇక ఈ మూవీ తర్వాత శేషు హాలీవుడ్ రేంజ్ లాంటి సినిమా చేయబోతున్నట్టు గతంలో ఓ వేదికపై చెప్పారు. 

Latest Videos

click me!