పింక్ చుడీదార్ లో కట్టిపడేస్తున్న తెలుగు అందం.. బ్యూటీఫుల్ లుక్ లో డింపుల్ హయాతీ మెరుపులు

First Published | Aug 3, 2023, 4:21 PM IST

డింపుల్ హయాతీ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనమిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరింత అందంతో ఆకట్టుకుంది. యంగ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్ తో ఆకర్షించింది.
 

తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతీ (Dimple Hayathi)  ఏపీలోని విజయవాడలో పుట్టింది. హైదరాబాద్ లో పెరిగిన ఈ ముద్దుగుమ్మ తన ఎడ్యుకేషన్ ను ఇక్కడే రాజధానిలోనే పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే సినీ రంగంపై ఆసక్తి చూపించింది. 
 

2017లో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఇదే డింపుల్ కు తొలిచిత్రం. అప్పటి డింపుల్ హయాతీ వయస్సు 19 ఏళ్లు కావడం విశేషం. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చి.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. 
 


‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో డింపుల్ స్పెషల్ అపియర్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐటెం సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ పాటతోనే తన క్రేజ్ మరో లెవల్ కు చేరుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంది. 
 

అటు తమిళం, హిందీలో ఒక్కో సినిమా చేసిన డింపుల్ మళ్లీ ‘ఖిలాడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ సరసన నటించి మెప్పించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో డింపుల్ కు మంచి ప్లస్ గా మారింది. ఆ వెంటనే ‘రామబాణం’తో అలరించింది.
 

కానీ ఈ మధ్యలో మాత్రం డింపుల్ హయాతీ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. పైగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ సెన్సేషనల్ ట్వీట్లు చేస్తూ హాట్ టాపిక్ గ్గా మారుతోంది. ఈ క్రమంలో నెక్ట్స్ ఎలాంటి సినిమాతో వస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. డింపుల్ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లో పద్ధతిగానే మెరుస్తూ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది. మత్తెక్కించే ఫోజులతో మైమరిపిస్తోంది. తాజాగా పింక్ చుడీదార్ లో మరింత అందంగా మెరిసింది. అదిరిపోయే ఫోజులిచ్చి కట్టిపడేసింది. లైక్ లు, కామెంట్లతో ఫ్యాన్స్ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!