ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రూమర్లకు చెక్ పెడుతూ NTR30పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్.!

Published : Oct 31, 2022, 02:42 PM ISTUpdated : Oct 31, 2022, 02:45 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎన్టీఆర్30’పై ఉన్న సందేహాలను క్లియర్ చేస్తూ చిత్ర యూనిట్ తాజాగా సాలిడ్ అప్డేట్ అందించారు.    

PREV
16
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రూమర్లకు చెక్ పెడుతూ NTR30పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్.!

‘ఆర్ఆర్ఆర్’తో  యంగ్  టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు తారక్. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఏఏ అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
 

26

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘ఆచార్య’తో డిజపాయింట్ చేసిన కొరటాలతో తారక్ సినిమా ఆగిపోయిందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది. 

36

మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయి నెలలు గడిచిపోతున్నా ఇప్పటికీ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. 
 

46

తాజాగా చిత్రంపై‘ఎన్టీఆర్ 30’ పీఆర్ టీమ్ స్పందించింది. డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే కథపై మరింతగా కసరత్తులు చేస్తుండగా... పెద్దఎత్తునప్రొడక్షన్ పనులు  కూడా మొదలు పెట్టారని క్లారిటీ ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ సినిమాలో భాగమైనట్టు తెలిపారు. 
 

56

అంతేకాకుండా సినిమాకు సంబంధించిన షూటింగ్ పైనా అప్డేట్ అందించారు. నవంబర్ 12న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్టు అప్డేట్ అందించారు. అప్పటి నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలవుతుందని అన్నారు. సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. 
 

66

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తోంది.  ఎన్టీఆర్ కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Madanna) టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
 

click me!

Recommended Stories