ఇదిలా ఉంటే భర్తతో విడిపోయిన తర్వాత సొంతంగా బతకాలనుకున్నప్పుడు నగలు అమ్మి ఓ సింగిల్ బెడ్ రూమ్ కి షిఫ్ట్ అయ్యానని, అప్పుడు కుమారుడిని చూసుకోవాల్సి పరిస్థితి ఉంది. చేతిలో డబ్బు లేదు, రేపేంటి? అనే మదన పడే సమయంలో పృథ్వీరాజ్ అనే నిర్మాత తనకు టెలివిజన్ సీరియల్(మాల్గుడి డేస్)లో అవకాశం ఇప్పించారని, ఆ సమయంలో తనకు పది వేల రూపాయల చెక్ తన చేతిలో పెట్టడంతో ఆ ఆనందానికి అవద్దుల్లేవని, ఊపిరి పీల్చుకున్నానని, ఇప్పుడు ఎన్ని లక్షలు సంపాదించినా, ఆ పది వేల చెక్‌ని మాత్రం తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని పేర్కొంది ప్రగతి. ఆద్యంతం ఎమోషనల్‌గా ఈ విషయాలను పంచుకుంటూ గుండె బరువెక్కించింది.