venkatesh, anil ravipudi,Sankranthiki Vasthunnam, chiranjeevi
ఒక కథ రాసుకున్న తర్వాత, రాసుకునేటప్పుడు ఫలానా హీరో అయితే బాగుంటుందని దర్శకుడుకి, రచయితకు అనిపిస్తుంది. అవకాశాన్ని బట్టి వారిని ఎప్రోచ్ అవుతూంటారు. అయితే రకరకాల కారణాలతో ఆ హీరో తో ప్రాజెక్టు ముందుకు వెళ్లదు. వేరే హీరోతో తెరెక్కిస్తూంటారు.
అలాంటిదే వెంకటేశ్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి జరిగింది. మొదట ఈ సినిమాని వెంకటేష్ కు కాకూండా మరో స్టార్ హీరోకు వినిపించామంటున్నారు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇంతకీ ఎవరా హీరో, వెంకటేష్ సీన్ లోకి ఎలా వచ్చారో చూద్దాం.
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju
‘సంక్రాంతికి వస్తున్నాం’ మంచి క్రేజీ కాంబినేషన్ గా ఫన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు.
ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది (Sankranthiki Vasthunnam).ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ కాంబినేషన్ లో గతంలో F2, F3 చిత్రాలు రావటంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju
అదే సమయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకూ మహారాజ్ చిత్రాల నుంచి పోటీ ఎదుర్కొటోంది. ఈ భారీ కాంపిటేషన్ లోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేయటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది.
ఇప్పటిదాకా వదిలిన ప్రమోషన్ కంటెంట్, అనీల్ రావిపూడి, వెంకటేష్ బ్రాండ్ వాల్యూనే ఈ సిట్యువేషన్ కు కారణం. ఇక ఈ చిత్రం రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం గురించిన విశేషాలు చెప్పుకొచ్చారు.‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం కథను మొదట మెగాస్టార్ చిరంజీవి చేయాలని ప్లాన్ చేసామని చెప్పుకొచ్చారు.
అనీల్ రావిపూడి మాట్లాడుతూ.... , “భగవంత్ కేసరి వంటి సీరియస్ చిత్రం తర్వాత మళ్లీ ఓ కామెడీ సినిమా చేయాలనుకున్నారు. అలాగే దిల్ రాజు గారితో సినిమా చేయాల్సి ఉంది. F2, F3 లకు డిఫరెంట్ గా ఉండే కథ కావాలి. అప్పుడు వచ్చిన ఆలోచన..పెళ్లాం, గర్ల్ ప్రెండ్ తో కలిసి ఓ వ్యక్తి ఎడ్వెంచర్ చేయటానికి వెళ్తే ఎలా ఉంటుందనేది. ఈ స్టోరీ లైన్ అనుకోగానే మొదట మెదిలిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు.
ఆయన్ని కలిసి అవుట్ లైన్ చెప్పాను. అయితే ఆయన వేర్వేరు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. నాకేమే సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఉంది. దాంతో వెంకటేష్ గారిని ఎప్రోచ్ అయ్యాను. వెంకటేష్ గారు వేవ్ లెంగ్త్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. దాంతో షూటింగ్ చాలా కంపర్ట్ గా జరిగింది. అదృష్టవశాత్తు నేను చిరంజీవితో త్వరలో సినిమా చేయబోతున్నాను..”
సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కథ ఓకే కాగా, స్క్రిప్ కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
"వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నారా? లేదంటే ఏమైనా కొత్తగా ట్రై చేయబోతున్నారా?" అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి స్పందిస్తూ "చిరంజీవిని చూపించడం అని కాదు గానీ ఆయన ఏమనుకుంటున్నారు? ఎలా చూపిస్తే బాగుంటుంది? అనే చర్చలు ఇంకా జరుగుతున్నాయి. ఆయన ఎలా కోరుకుంటే అలాగే చిరంజీవిని ప్రజెంట్ చేస్తాను అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ "నా దృష్టిలో ఒక చిరంజీవి గారు ఉన్నారు... అది వింటేజా ఇంకోటా అనేది నేను చెప్పలేను. నా దృష్టిలో ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక ఎంత మందికి రీచ్ అయ్యింది అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏం చూపించాలి, ఏం చూపించకూడదు అనేదాన్ని నేను ఇప్పుడు ఫిక్స్ అవ్వలేదు.
నేను ఎలా చూపించాలి అనుకుంటున్నాను అంటే నేను ఒక చిరంజీవి గారిని చూస్తున్నాను. నాకు కనబడుతున్న ఆయనను ఎలా చూపించాలి అనే విషయం ఇంకా వర్క్ స్టేజ్ లో ఉంది. కథ అంతా కంప్లీట్ చేశాక చిరంజీవి గారు ఇలా ఉండబోతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. స్క్రిప్ట్ అంతా పూర్తి చేశాక దాంట్లో చిరంజీవి గారి స్ట్రెంత్ ఏంటి? అనేదాన్ని బేస్ చేసుకుంటాము'' అని అన్నారు.