చీమకుర్తి శ్రీకాంత్, జబర్దస్త్ నటి రీతూ చౌదరి భూ వివాదం వ్యావహారం రోజు రోజుకి హాట్ టాపిక్ అవుతోంది. వీరిద్దరూ 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్లు గత కొన్ని రోజులు వార్తలు వస్తున్నాయి. వెరీ వెనుక గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద వ్యక్తులు కూడా ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కువగా హైలైట్ అవుతున్నది మాత్రం రీతూ చౌదరినే.
రీతూ చౌదరికి, శ్రీకాంత్ కి రిలేషన్ గురించి అనేక రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి. అయితే శ్రీకాంత్ తో తాను రిలేషన్ లో ఉన్న సంగతి నిజమే అని రీతూ అంగీకరించింది. పెళ్లి మాట ఎత్తడం లేదు కానీ.. విడాకులకు అప్లై చేసినట్లు చెబుతోంది. విడాకులకు అప్లై చేశారు అంటే గతంలో పెళ్లి జరిగినట్లే. శ్రీకాంత్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు రీతూ చౌదరి పేరుపై 400 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేయించారట. ఆ భూమి విలువ కొన్ని కోట్లల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పటికి నేను శ్రీకాంత్ తో రిలేషన్ ప్రారంభించి కొన్ని నెలలు అయింది. నెలల తరబడి ప్రేమలో ఉన్నాను కాబట్టి అతడిని గుడ్డిగా నమ్మాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి తీసుకెళ్లాడు. అక్కడ నాకు సిబ్బంది మర్యాదలు చేశారు. కాబట్టి అంతా చట్టప్రకారం జరుగుతోంది అని అనుకున్నా. సంతకం పెట్టమంటే డాక్యుమెంట్స్ పై సైన్ చేశా. అది అక్రమం అని వార్తల్లో వచ్చేవరకు నాకు తెలియదు. రీతూ అంత అమాయకురాలా అని విమర్శిస్తున్నారు. ప్రేమించాను కాబట్టి గుడ్డిగా నమ్మాను.. మోసపోయాను అని తేల్చేసింది.
ఇప్పుడైతే నాకు శ్రీకాంత్ కి ఎలాంటి సంబంధం లేదు. ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నాం. విడాకులకు కోర్టులో అప్లై చేశాం. కానీ శ్రీకాంత్ విడాకులకు ఒప్పుకోవడం లేదు. తన పేరుపై 4 కోట్ల విలువైన భూములని శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ అందరూ ఎందుకు 700 కోట్లు అని రాస్తున్నారు అంటూ రీతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాంత్ తో గోవాకి తాను నాలుగు సార్లు వెళ్లినట్లు రీతూ చౌదరి అంగీకరించింది. అయితే చివరి ఏడాది కాలంలో తాను ఎలాంటి గోవా ట్రిప్పులకు అతడితో వెళ్ళలేదు అని పేర్కొంది. గోవాలో హనీ ట్రాపులు, తాను ఏదో చేసేసినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని రీతూ పేర్కొంది.