Tharun Bhascker: తరుణ్‌ భాస్కర్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఈషా తోడుంది.. రిలేషన్‌పై తల్లి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌

Published : Nov 18, 2026, 09:21 AM IST

నటుడు, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, నటి ఈషా రెబ్బా రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రూమర్స్ ని పటాపంచల్‌ చేసింది తరుణ్‌ భాస్కర్‌ తల్లి గీతా భాస్కర్‌. ఓపెన్‌గా చెప్పేసింది.

PREV
13
ఈ నగరానికి ఏమైంది రిపీట్‌ మూవీతో రాబోతున్న తరుణ్‌ భాస్కర్‌

దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. ప్రస్తుతం ఆయన `ఈనగరానికి ఏమైంది రిపీట్‌`(ఈఎన్‌ఈ 2) సినిమాని రూపొందించారు. ఇందులో విశ్వక్‌ సేన్‌, శ్రీనాథ్‌, అభినవ్‌ గోమటం, శివాత్మిక రాజశేఖర్‌, శ్రావణ్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం రేపు గురువారం(నవంబర్‌ 19)న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో తరుణ్‌ భాస్కర్‌ తల్లి గీతా భాస్కర్‌ కూడా పాల్గొన్నారు. సినిమా గురించి మాట్లాడే క్రమంలో కొడుకు తరుణ్‌ భాస్కర్‌ స్ట్రగులింగ్‌ డేస్‌ గురించి వెల్లడించింది.

23
తరుణ్‌ భాస్కర్‌, ఈషారెబ్బా రిలేషన్‌ని కన్ఫమ్‌ చేసిన గీతా భాస్కర్‌

గత రెండేళ్లుగా తరుణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని, కోర్టు కేసులు, ఇళ్లు కట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డాడని ఆమె వెల్లడించారు. ఈ కష్టకాలంలో తరుణ్‌కు అండగా నిలిచిన వ్యక్తి ఈషా రెబ్బా అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత రెండేళ్లుగా తరుణ్ చాలా కష్టాలు చూశాడని, కొన్ని సందర్భాల్లో ఇంటికి కూడా వచ్చేవాడు కాదని చెప్పారు. ఒకవేళ ఇంటికి వచ్చినా రాత్రి 2 గంటలకు, 4 గంటలకు వచ్చేవాడని వెల్లడించారు. అలాంటి సమయంలో అతనికి తోడుగా నిలిచింది ఈషా రెబ్బా అని తెలిపారు.

ఈషా కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని, తరుణ్‌కు మంచి తోడు, సపోర్ట్ అని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు, తరుణ్‌కు రాత్రి వేళల్లో కూడా భోజనం పెట్టేంతగా అండగా నిలిచిందని, ఆమె రూపంలో తన కొడుకుకు మంచి సోల్‌మేట్ దొరికిందని గీతా భాస్కర్ వ్యాఖ్యానించారు.

తనకు వయసు పెరుగుతోందని, తన తర్వాత తరుణ్ పరిస్థితి ఏమిటని గతంలో భయపడేదాన్నని కూడా ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఈషా రూపంలో తరుణ్‌కు మంచి తోడు లభించడంతో ఇప్పుడు తనకు ధైర్యంగా ఉందనే భావనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' సినిమా పూర్తి చేయడంలో కూడా ఈషా తరుణ్‌కు ఎంతో సపోర్ట్ చేసిందని వెల్లడించారు.

33
పెళ్లి వార్తలకు మరింత బలం?

నిజానికి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య ప్రేమాయణం నడుస్తోందనే ప్రచారం చాలాకాలంగా ఉంది. గతంలో పండుగ వేడుకల్లో వీరిద్దరూ కలిసి కనిపించడం, ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం ఈ వార్తలకు కారణమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో 'ఓం శాంతి శాంతిః' సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది.

అప్పట్లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ఈషా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఫ్రెండ్ కంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో తమ రిలేషన్‌ గురించి చెబుతానని అన్నారు. మరోవైపు ఈషా రెబ్బా మాత్రం తాను ఒకరితో డేటింగ్‌లో ఉన్నానని తెలిపారు. తరుణ్‌ తో రిలేషన్‌ని ఖండించలేదు. ఇప్పుడు గీతా భాస్కర్‌ కామెంట్స్ తో దీనిపై క్లారిటీ వచ్చింది. అన్నీ కుదిరితే త్వరలోనే వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories