ఈరోజు ఎపిసోడ్ లో రిషి మహేంద్ర అన్న మాటలు, గౌతమ్ అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రిషి రాత్రంతా అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉండగా తెల్లవారిపోతుంది. అప్పుడు గౌతమ్ తో సరదాగా గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి వసు కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు వసుధార,రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు వసు రిషి వైపు అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు గౌతమ్, మహేంద్రతో ఫోన్ మాట్లాడుతూ లేదు అంకుల్ జరిగిన విషయం గురించి నాకు నమ్మకం పోయింది. నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను అని అంటాడు.