గరికపాటి నరసింహా రావు తెలుగు సినిమా పాటలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ బన్నీ సినిమాలోని పాట పై గరికపాటి తీవ్ర విమర్శలు చేశారు.
ప్రముఖ అవధాని, ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావు గురించి పరిచయం అవసరం లేదు అవసరమైనప్పుడు చలోక్తులు విసురుతూ, సెటైర్లు వేస్తూ గరికపాటి అందరినీ ఆకట్టుకునేలా ప్రవచనాలు చెబుతుంటారు. ఆయన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడూ గరికపాటి తన ప్రవచనాల్లో సినిమాలని కూడా జోడిస్తుంటారు.
25
అల్లు అర్జున్ పాటపై సెటైర్లు
ఓ కార్యక్రమంలో తెలుగు భాష, సాహిత్యం, భారతీయ సంస్కృతి గురించి గరికపాటి మాట్లాడుతూ తెలుగు సినిమా పాటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ సినిమా పరువు తీసేలా ఆయన సెటైర్లు వేశారు. గరికపాటి వేసిన సెటైర్లకు అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇంతకీ గరికపాటి ఏమన్నారో వివరాల్లో చూద్దాం. అర్థం కాని విషయాలపైనే అందరి ద్రుష్టి ఉంటుంది. మన పిల్లలు చూడండి తెలుగు పాటలు వినరు.. హిందీ పాటలు వింటారు. ఎందుకంటే అవి అర్థం కావు కదా.
35
గబ్బర్ సింగ్ చూసి చేతులెత్తి దండం పెట్టా
ఈ మధ్యన తెలుగు పాటలని కూడా అర్థం కాకుండా చేస్తున్నారు. నేను గబ్బర్ సింగ్ సినిమా చూసి థియేటర్ లోనే చేతులెత్తి దండం పెట్టాను. ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే అనే పాట చూసి రచయిత చంద్రబోస్ కి చేతులెత్తి నమస్కారం చేశాను. ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే.. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే.. ఎంత గొప్ప పాట, ఎంత గొప్ప సాహిత్యం అది.
కవిత్వం చచ్చిపోలేదు.. రసజ్ఞత చచ్చిపోయింది. బన్నీ బన్నీ బన్నీ బన్నీ నిన్ను చూస్తే జారుతోంది చున్నీ అనే పాట రాసింది కూడా చంద్రబోస్ నే. అల్లు అర్జున్ బన్నీ చిత్రంలోనిది ఈ పాట. చున్నీ జారడం వరకు కవిత్వమే ఒప్పుకుంటాను. 'అల్లుడెప్పుడవుతావని అడుగుతోంది పిన్ని'.. ఇది దిక్కుమాలిన కవిత్వం. పిన్నీకి ఎందుకు తొందర.. బాబాయి చాచడుగా అంటూ గరికపాటి సెటైర్లు వేస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.
55
పుష్పపై కూడా విమర్శలు
గతంలో పైట జారడం పై పద్యాలు పాటలు రాశారు, చున్నీ జారడం పై ఇటీవల రాశారు. టీ షర్ట్స్ వచ్చాక ఇక ఏమీ రాయలేరు అంటూ గరికపాటి సెటైర్లు వేశారు. ఆ మధ్యన గరికపాటి అల్లు అర్జున్ పుష్ప సినిమాపై కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సినిమా పాటలు ఎంతలా వైరల్ అవుతున్నాయో అదే స్థాయిలో వివాదం కావడం కూడా చూస్తూనే ఉన్నాం.