GAME CHANGER, CHENNAI EVENT, Ramcharan, shankar
చెన్నై లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా "గేమ్ ఛేంజర్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగాల్సి ఉంది. తమిళ వెర్షన్ ప్రమోషన్స్ కోసం అక్కడ భారీగా ఈవెంట్ ఏర్పాటు చేసారు. అయితే ఆ ఈవెంట్ కాన్సిల్ అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ కాన్సిల్ వార్తలు మాత్రం మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
దాంతో తమిళంలో ఉన్న మెగా అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ తెలుగు అభిమానులు, తమిళనాడులో సెటిలైన తెలుగు వారు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేసారు. ఈ మేరకు అక్కడ ఫర్మిషన్స్ తీసుకోవటం, ఈవెంట్ కోసం యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు జరిగాయి. అయితే లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కు ఉన్న సమస్యతోనే ఈవెంట్ ని రద్దు చేసారని చెప్పుకుంటున్నారు.
Ram Charans Game Changer film update out
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన గేమ్ ఛేంజర్.. జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. శంకర్ తమిళ డైరెక్టర్ అవ్వడం.. ఆర్ఆర్ఆర్ తో చరణ్ మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో తమిళనాడులో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మంచి వసూళ్లు కూడా వస్తాయని ఆశిస్తున్నారు. దాంతో అక్కడ కూడా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు.
Game Changer
ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మేకర్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్ ను నిర్వహించారు. నార్త్ లో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో తమిళనాడులో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. చెన్నై వేదికగా ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమానికి పలువురు తమిళ సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా వస్తారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు చెన్నై ఈవెంట్ రద్దు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ మేకర్స్ నిలిపివేశారని సమాచారం.
తమిళ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు , శంకర్ కు మధ్య ఉన్న వివాదం కారణంగా ఈవెంట్ ను మేకర్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ.. తమిళనాడులో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను రీసెంట్ గా ఆశ్రయించింది.
తన చేతిలో ఉన్న ఇండియన్ 3 చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ పూర్తి చేసే వరకు.. గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయడానికి వీలు లేదని డిమాండ్ చేసింది. అయితే లైకాతో చర్చలు జరుగుతున్నాయని, మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ కానుందని తెలుస్తోంది. కానీ ఈ వివాదాల మధ్య ఈవెంట్ ఎందుకన్నట్లు మేకర్స్ రద్దు చేశారని వినికిడి.