Bigg Boss Telugu 10: బోల్డ్ యాంకర్ గా యూట్యూబ్ లో అందరికీ సుపరిచితమైన సుధీర్ రెడ్డి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని.. ఎలా యూట్యూబ్ తో సక్సెస్ అయ్యాడో సుధీర్ పంచుకున్నాడు.
'కష్టాలు మనుషుల్ని కుంగదీస్తాయి.. కానీ కొందరిని మాత్రం శిఖరాల వైపు నడిపిస్తాయి' అనే మాట డిజిటల్ యాంకర్ సుధీర్ రెడ్డి జీవితానికి సరిగ్గా సరిపోతుంది. ప్రముఖ సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ రెడ్డి, ఇప్పుడు తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 4వ కంటెస్టెంట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
24
చదువులో ఫెయిల్యూర్స్.. సింగపూర్ చెఫ్ కల భగ్నం..
ఈ రోజు కెమెరా ముందు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే సుధీర్ లైఫ్ ప్రయాణం అంత తేలికగా ఏమీ సాగలేదు. కాలేజీ రోజుల్లో సుధీర్ చదువులో చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. చదువు అబ్బకపోవడంతో తనకంటూ ఒక లైఫ్ వెతుక్కోవడానికి తీవ్రంగా శ్రమించారు. వంటకాలపై ఉన్న ప్రావీణ్యంతో ఎలాగైనా లైఫ్‌లో సెటిల్ అవ్వాలని సింగపూర్ వెళ్లి 'చెఫ్' గా మారాలని కలలు కన్నారు. అయితే.. అక్కడ స్నేహితుడు మోసం చేయడంతో.. చేతిలో డబ్బులు లేక హౌస్ కీపింగ్ పనులు చేస్తూ, తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడ్డాడు. తర్వాత.. అక్కడి నుంచి మరొకరి సహాయంతో ఇండియా వచ్చి.. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్‌లో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలను సైతం బోల్డ్ ప్రశ్నలతో నెట్టింట ట్రెండింగ్‌లో నిలిపారు.
34
3 నెలల్లో 22 కేజీల బరువు తగ్గి షాక్...
లైఫ్‌లో ఎదురైన కష్టాలు, మానసిక ఒత్తిడి కారణంగా ఒకానొక దశలో సుధీర్ బరువు విపరీతంగా పెరిగిపోయి దాదాపు 100 కేజీలకు చేరుకున్నారు. కానీ తనను తాను మార్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే 100 కేజీల నుంచి 78 కేజీలకు తగ్గారు. ఏకంగా 22 కేజీల బరువు తగ్గి, తన కఠినమైన క్రమశిక్షణతో మైండ్ బ్లాకింగ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
జీవితంలో ఎదురైన మోసాలు, చదువులో ఫెయిల్యూర్స్, శారీరక మానసిక కష్టాలన్నింటినీ దాటుకుని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో 4వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సుధీర్ రెడ్డి కథ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్. తనలోని స్ట్రాంగ్ మైండ్‌సెట్, స్ట్రెయిట్ టాకింగ్ నైజంతో బిగ్ బాస్ హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లకు ఈయన ఎలాంటి టఫ్ కాంపిటీషన్ ఇస్తారో చూడాలి