జీ నెట్వర్క్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ కి చెందిన ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ లో ఈ చిత్రం నిర్మాణం కానుంది. ఇదంతా త్రివిక్రమ్ స్కెచ్ అని అంటున్నారు. భీమ్లా నాయక్ చిత్రాన్ని కూడా త్రివిక్రమ్ వెనుక ఉండి నడిపించారు. కేవలం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్ షీట్స్ కోసం నిర్మాతలు 60 కోట్ల రికార్డ్ రెమ్యునరేషన్ ముట్టజెప్పబోతున్నట్లు టాక్. కొసమెరుపు ఏంటంటే రెమ్యునరేషన్ కాకుండా పవన్ లాభాల్లో 20 శాతం వాటా కూడా తీసుకోబోతున్నారట.