ఈ అట్టర్ ప్లాప్ సినిమాలకు క్రేజెక్కువ

First Published 20, May 2019, 5:06 PM IST

కొన్ని చిత్రాలు భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరుస్తాయి. కానీ ఆ చిత్రాలకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. ఆరెంజ్, ఖలేజా లాంటి చిత్రాలకు బుల్లితెరపై విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. 

నిజం : తేజ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ప్రభుత్వ అధికారుల్లో ఉన్న అవినీతి నేపథ్యంలో తెరకెక్కింది. సామాన్య యువకుడిగా మహేష్ బాబు నటన ఈ చిత్రంలో అద్భుతంగా ఉంటుంది.
హ్యాపీ : అల్లు అర్జున్, జెనీలియా ఈ చిత్రంలో జంటగా నటించారు. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ కొందరిని ఆకట్టుకుంది.
ఆరెంజ్ : మగధీర తర్వాత రాంచరణ్ నటించిన చిత్రం ఇది. కమర్షియల్ గా రాంచరణ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్. కానీ ఇందులో కథాంశం అద్భుతం అని ఇప్పటికి కొందరు అభిమానులు అంటుంటారు.
1 నేనొక్కడినే : సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయింది. తీవ్రంగా నిరాశపరచినప్పటికీ మహేష్ కెరీర్ లో ఇది ఒక క్లాసిక్ అనే అభిమానులు ఉన్నారు.
పంజా : పవన్ కళ్యాణ్ గడ్డం లుక్ లో ఈ చిత్రంలో స్టైలిష్ గా కనిపించాడు. సినిమా నిరాశపరిచినప్పటికీ ఈ చిత్రంలో పవన్ స్టైలింగ్ చాలా బావుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతుంటారు.
ఊసరవెల్లి : సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, తమన్నా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్ లో అందించిన అద్భుతమైన ఆల్బమ్స్ లో ఈ చిత్రం కూడా ఉంటుంది.
7th సెన్స్ : సూర్య, మురుగదాస్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇంగ్లీష్ వైద్యం అవసరం లేకుండా మన పూర్వీకులు,రుషులు అద్భుతమైన ఔషదాలని కనిపెట్టారని ఈ చిత్రం ద్వారా మురుగదాస్ తెలియజేశాడు.
బాబా : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాబా చిత్రం ఆధ్యాత్మిక కోణంలో సాగుతుంది. బాబా చిత్రం వెండితెరపై నిరాశపరిచినప్పటికీ బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు.
చెన్నకేశవరెడ్డి : వివి వినాయక్, బాలయ్య కాంబోలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. అప్పటికే ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. దీనితో చెన్నకేశవరెడ్డి చిత్రానికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో చెలరేగి నటించాడు.
జానీ : వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కు జానీ చిత్రం బ్రేక్ వేసింది. ఈ చిత్రాన్ని చూసుకుని ఇప్పటికి పవన్ అభిమానులు మురిసిపోతుంటారు.
ఖలేజా : దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంలో మహేష్ ని కొత్తగా ప్రజెంట్ చేశాడు. మహేష్, అనుష్క మధ్య సాగే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి.వెండితెరపై ప్లాపై టీవీల్లో ఆకట్టుకున్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి.
చక్రం : కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఎమోషనల్ మూవీ ఇది. విడుదలైనప్పుడు ఈ చిత్రం అంతగా రుచించకపోయినా టివీల్లోకి వచ్చాక మంచి ఆదరణ లభించింది.
శంకర్ దాదా జిందాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన సందేశాత్మక చిత్రాల్లో ఇది కూడా ఒకటి. శంకర్ దాదా ఎంబిబిఎస్ కి సీక్వెల్ గా తెరకెక్కించారు.
కంచె : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభంలోనే ప్రయోగాలకు తెరలేపాడు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నటన అద్భుతంగా ఉంటుంది.