ఫస్ట్ సినిమా ఇంకా రిలీజే కాలేదు.. కుప్పలు తెప్పలుగా ఆఫర్లు.. ఆ సంచలన హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Published : Jun 18, 2024, 08:13 PM IST

టాలీవుడ్‌లోకి మరో యంగ్‌ సెన్సేషన్‌ రాబోతుంది. ఫస్ట్ సినిమా విడుదల కాకుండానే కుప్పలు తెప్పలుగా ఆమెకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మరి ఆమె ఎవరో తెలుసా?   

PREV
18
ఫస్ట్ సినిమా ఇంకా రిలీజే కాలేదు.. కుప్పలు తెప్పలుగా ఆఫర్లు.. ఆ సంచలన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Sreeleela

శ్రీలీల, కృతి శెట్టి మొదటి సినిమా హిట్‌తోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుని ఒక్కసారిగా టాలీవుడ్‌ని షేక్‌ చేశారు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్‌ మాత్రం తొలి సినిమా రిలీజ్‌ కాకుండానే దుమారం రేపుతుంది. ఆ బ్యూటీకి కుప్పులు తెప్పులుగా ఆఫర్లు వస్తున్నాయి. క్రేజీ ఆఫర్లతో దుమ్మురేపుతుంది. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఇంతకి ఎవరా హీరోయిన్‌? ఆమె కథేంటి? చూస్తే.. 
 

28

 అంతగా ఆఫర్లు తెచ్చుకుంటూ, సంచలనంగా మారిన హీరోయిన్‌ భాగ్య శ్రీ బోర్సే. పూణేకి చెందిన బ్యూటీ. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. అనేక స్ట్రగుల్స్ పడింది. ఎట్టకేలకు సినిమా ఆఫర్లు దక్కించుకుంది. ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. `యారియాన్‌ 2` సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ బాగానే ఆడింది. కానీ ఇందులో భాగ్య శ్రీ నటన, అందం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

38

ఈ బ్యూటీపై దర్శకుడు హరీష్‌ శంకర్‌ కన్నుపడింది. ఈ అమ్మడి నటనకు, అందానికి ఫిదా అయ్యాడు. మన తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే మాస్‌ మహారాజా రవితేజకి జోడీగా ఎంపిక చేశారు. `మిస్టర్‌ బచ్చన్‌`లో హీరోయిన్‌గా భాగ్య శ్రీ బోర్సేనే తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దీనితో టాలీవుడ్‌కి పరిచయం కాబోతుంది భాగ్య శ్రీ బోర్సే. 
 

48

ఈ సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు. దానికి చాలానే టైమ్‌ ఉంది. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వస్తున్నాయి. అధికారికంగా వినిపించే ఆఫర్లే రెండు మూడు ఉంటే, బయటకు రానివి ఇంకా చాలానే ఉన్నాయట. మరి ఈ అమ్మడికి వచ్చిన ఆఫర్లేంటనేది చూస్తే. రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండకు జోడీగా ఎంపికైంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న `వీడీ12`లో హీరోయిన్‌గా భాగ్య శ్రీనే ఎంపికైంది. 
 

58

దీంతోపాటు దుల్కర్‌ సల్మాన్‌తోనూ కలిసి నటించే ఆఫర్‌ని దక్కించుకుందట. దుల్కర్‌ సల్మాన్‌ మన తెలుగు హీరో అయిపోయాడు. ఆయన వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే `మహానటి`, `సీతారామం` చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు `లక్కీ భాస్కర్‌` మూవీ చేస్తున్నాడు. దీంతోపాటు మరో సినిమాకి సైన్‌ చేశాడు దుల్కర్‌. 
 

68

సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. రవి అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా భాగ్య శ్రీ బోర్సే ని ఎంపిక చేశారట. ఇది దాదాపు ఖరారు అని అంటున్నారు. ఇలా  తెలుగులోకి ఎంట్రీ ఇంకా జరగనేలేదు, అప్పుడే మూడు ఆఫర్లు కొల్లగొట్టింది భాగ్య శ్రీ. ఇదే కాదు ఇంకా ఆమె కోసం మేకర్స్ క్యూ కడుతున్నారట. దీంతో టాలీవుడ్‌లో మరో సంచలన హీరోయిన్‌గా మారుతుంది భాగ్య శ్రీ. 
 

78

శ్రీలీల, కృతి శెట్టి వంటి భామలు తొలి సినిమా తర్వాత సంచలనంగా మారారు. కుప్పలు తెప్పలుగా ఆఫర్లు అందుకుని బోల్తా పడ్డారు. కానీ భాగ్యశ్రీకి మాత్రం ఆమె తొలి మూవీ రిలీజ్‌ కాకముందే ఇన్ని ఆఫర్లు రావడం చాలా అరుదైన విషయమనే చెప్పాలి.

88

మరి ఆ ఇద్దరు బ్యూటీల్లాగే ఈమె మిగిలిపోతుందా? సెలక్టీవ్‌గా వెళ్తుందా అనేది చూడాలి. దాన్ని బట్టే ఆమె కెరీర్‌ నిర్మాణం ఆధార పడి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories