సూర్య కిరణ్ చనిపోయారని న్యూస్... అందుకే బిగ్ బాస్ హౌస్ కి..!

First Published Sep 15, 2020, 1:51 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా మొదలుకాగా, మొదటి ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. మొదటివారానికిగానూ నామినేట్ అయిన ఏడుగురు ఇంటి సభ్యుల నుండి దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక తన మనోభావాలు సూర్య కిరణమ్ పంచుకున్నారు. 
 

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని అందరికీ ఉంటుంది. మంచి రెమ్యూనరేషన్ తో పాటుఫేమ్ రావడానికి అదొక ప్లాట్ ఫార్మ్. దీని కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మరింత కఠినంగా జరిగింది. ఇంటి సభ్యులు కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాటు, 15రోజుల కొరెంటైన్ గడిపివచ్చారు.
undefined
ఇన్ని ప్రయాసలకోర్చి ఇంటిలోకి వెళ్లిన మొదటివారమే తట్టాబుట్టా సర్దాల్సిన పరిస్థితి వస్తే అంతకన్నా నిరాశ మరోటి ఉండదు. బిగ్ బాస్ సీజన్ 4కి గాను ఈచేదు అనుభవం డైరెక్టర్ సూర్య కిరణ్ కి ఎదురైంది. ఎలిమినేషన్ ద్వారా మొదటివారమే హౌస్ నుండి ఆయన బయటికి వచ్చేశారు.
undefined
బయటికి వచ్చాక సూర్య కిరణ్ బిగ్ బాస్ హౌస్ అనుభవాలతో పాటు, ఎలిమినేషన్ వలన కలిగిన బాధ పంచుకున్నారు. సూర్య కిరణ్ బాలనటుడిగా రెండు నంది, మూడు జాతీయ అవార్డులు అందుకున్నారట. దర్శకుడిగా ఆయన చేసిన మూవీ సత్యం సూపర్ హిట్. 2003లో వచ్చిన ఆ చిత్రం సుమంత్ అందుకున్న మొదటి హిట్ మూవీ.
undefined
సత్యం మూవీ తరువాత సూర్య కిరణ్ కొన్ని సినిమాలు చేశారట, వ్యక్తిగత కారణాలతో చెన్నై వెళ్లిపోయారట. దర్శకుడిగా చాలా గ్యాప్ రావడంతో సూర్య కిరణ్ చనిపోయాడని న్యూస్ వచ్చిందట. దానితో కొత్త మూవీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. ఉగాది నాడు షూటింగ్ లాంఛ్ అనగా కరోనా రావడం జరిగింది. దీనితో మూవీకి బ్రేక్ పడింది.
undefined
దీనితో ఎటూ జనాలు మర్చిపోయారు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ద్వారా అందరికీ మన ఉనికి తెలుస్తుంది, అప్పుడు కమ్ బ్యాక్ ఇవ్వడం ప్లస్ అవుతుందని అనుకున్నారట. అందుకే బిగ్ బాస్ హౌస్ కి రావాలని డిసైడ్ అయ్యారట. ఒక మూడు, నాలుగు వారాలు ఉంది బయటికి వచ్చేయాలి, సినిమా పనులు చూసుకోవాలని అనుకున్నారట.
undefined
మొదటివారమే హౌస్ నుండి బయటికి రావడం నిరాశ కలిగించింది అన్నారు. ఇక హౌస్ లో అందరూ ఆర్టిఫీషియల్ గా ఉన్నారు. కెమెరా కాప్చర్ చేస్తుందని అసహజంగా ప్రవర్తిస్తున్నారు. బిర్యానీ ఎప్పుడు చూడనట్లు, వర్షం వస్తే చిందులు వేయడం వంటివి చేస్తున్నారు. అలా చేస్తేనే తమ ఫుటేజ్ టెలికాస్ట్ చేస్తారనుకుంటున్నారు అని అన్నారు.
undefined
click me!