Sudheer Marriage: ఎట్టకేలకు చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేసిన సుధీర్... అందరికీ తెలిసిన బుల్లితెర నటి?

Published : Apr 08, 2022, 01:51 PM IST

బుల్లితెర సూపర్ స్టార్ సుధీర్ పెళ్లి  ఎప్పుడనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. థర్టీ ప్లస్ లో ఉన్న సుధీర్ కి పెళ్లీడు ఎప్పుడో దాటిపోయింది. ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ లు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. సుధీర్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

PREV
16
Sudheer Marriage: ఎట్టకేలకు చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేసిన సుధీర్... అందరికీ తెలిసిన బుల్లితెర నటి?
Sudigali Sudheer Marriage

బుల్లితెరపై ఆయనది ప్లే బాయ్ ఇమేజ్. కామెడీ స్కిట్స్ లో ఆయన క్యారెక్టర్ అమ్మాయిల వెంటపడే జులాయిగా ఉంటుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే  శృంగార ప్రియుడిగా ఉంటుంది. హాస్యం కోసం తనని తాను తగ్గించుకుంటూ పంచెస్ వేయించుకుంటూ ఉంటాడు సుధీర్. ఆ తరహా కామెడీ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయడంతో అయన కొనసాగిస్తున్నారు. 
 

26
Sudigali Sudheer Marriage

మరోవైపు ఆయనకు యాంకర్ రష్మీ(Rashmi Gautam)తో ఎఫైర్ ఉందనే ఓ ప్రచారం చాలా ఏళ్లుగా నడుస్తుంది. జనాల్లో ఈ జంటలకు భలే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడం కోసం స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ, సుదీర్ లకు పెళ్లి చేశారు. పలుమార్లు రష్మీ-సుధీర్ ఉత్తిత్తి పెళ్లి చేసుకున్నారు. రియల్ లైఫ్ లో వారిద్దరూ ఏంటనేది ఎప్పటికీ సస్పెన్సే. ఇద్దరూ పెళ్లి మాట ఎట్టకపోవడంతో ఏదో ఒకరోజు సడన్ గా పెళ్లి వార్త ప్రకటిస్తారేమో అనే సందేహాలు కూడా ఉన్నాయి. 
 

36
Sudigali Sudheer Marriage

అయితే ఫైనల్ గా సుధీర్ (Sudigali Sudheer)తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశారు.   'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో వేదికగా ఇది జరిగింది.  ఈ ఆదివారం ప్రసారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అత్యంత ఆసక్తికర సంఘతన చోటు చేసుకుంది. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ తండ్రికి మళ్లీ పెళ్లి చేయబోతున్నట్లు చూపించారు. ఆయనతో పాటు కమెడియన్ల తండ్రులు దీనికి ఎంట్రీ ఇచ్చారు.
 

46
Sudigali Sudheer Marriage


ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం సందడిగా సాగింది. అలాగే, కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను కూడా చూపించారు. ఇక, ఆఖర్లో బుల్లెట్ భాస్కర్ తండ్రి సుధీర్‌తో 'మీ నాన్నతో ఇప్పుడే ఫోన్‌లో మాట్లాడాను. మావాడు టీవీలోనే పెళ్లి చేసుకుంటున్నాడు. నిజంగా ఎప్పుడు చేసుకుంటాడు? ఇండస్ట్రీ అమ్మాయిని చేసుకుంటాడా? బయట అమ్మాయిని చేసుకుంటాడా అని అడిగారు' అని చెప్పారు. 
 

56
Sudigali Sudheer Marriage

బుల్లెట్ భాస్కర్ తండ్రి అడిగిన వెంటనే సుడిగాలి సుధీర్ స్పందించాడు. 'ఇంత మంది ఫాదర్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి.. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద చెప్పబోతున్నా. నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానంటే' అంటూ సిగ్గు పడుతూ స్టేజ్ కింద వైపు వెళ్లాడు. ఆ షోలోనే ఆ అమ్మాయి ఉందంటే పరిశ్రమకు చెందిన అమ్మాయే కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ తో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

66
Sudigali Sudheer Marriage


ఇక బుల్లితెర కమెడియన్, యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్న సుధీర్.. హీరోగా సినిమాలు కూడా చేస్తున్నారు.  సుధీర్ హీరోగా 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' తెరకెక్కాయి. అయితే ఈ రెండు చిత్రాలు అనుకున్నంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' చిత్రాలు ఆయన హీరోగా తెరకెక్కుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories