'డార్లింగ్స్... ఎట్టకేలకు మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వస్తున్నారు. మీరు వేచి చూడండి' అని ప్రభాస్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ పెట్టాడు. ఎట్టకేలకు, జీవితంలోకి, ప్రత్యేకమైన వ్యక్తి... అనే పదాలు భార్యను సూచిస్తున్నాయి. మీరు కోరుకుంటున్న తరుణం వచ్చింది. నాకు కాబోయే భార్యను పరిచయం చేయబోతున్నాను... అని ప్రభాస్ పరోక్షంగా చెప్పాడనే వాదన మొదలైంది.