ఈరోజు( పిబ్రవరి 29) చాలా స్పెషల్. అది అందరకి తెలిసిందే.. ఇది లీప్ ఇయర్ డే. నాలుగు ఏళ్లకు ఒక్క సారి వచ్చే రోజు ఇది. ఈ డేట్ చాలా మందికి స్పెషల్. ముఖ్యంగా ఈరోజు పుట్టిన వారికి మరీ స్పెషల్ అనాలి. అంతే కాదు ఈరోజు పెళ్ళి చేసుకున్నవారు కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి. అయితే సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలెందరో ఈ లీప్ ఇయర్ డే రోజు పుట్టారు. అందులో మన తెలుగు యంగ్ స్టార్ ఒకరు కూడా ఉన్నారు.
సాధారణంగా ప్రతీ ఏడాది పుట్టిన రోజు చేసుకుంటాం.. అందులోప్రత్యేకత ఏం లేదు కానీ... లీప్ ఇయర్ లో పుట్టి బర్త్ డే చేసుకోవడమే చాలా స్పెషల్. నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే లీప్ ఇయర్, ఫిబ్రవరి 29 డేట్ వస్తుంది. ఈ రోజు పుట్టిన వాళ్ళు నాలుగేళ్లకు ఒకసారి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈ డేట్ లో పుడితే ఇంట్లోనే కాదు సమాజంలో కూడా కాస్త స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాస్త జోకులేసేవాళ్లు కూడా ఉంటారనుకోండి. ఇక మన తెలుగు పరిశ్రమలో ఈ లీప్ ఇయర్ లో పుట్టిన ఏకైక హీరో ఎవరో తెలుసా.. శ్రీవిష్ణు.
sree vishnu
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో సందడి చేస్తూ.. అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాలతో మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. కమర్షియల్ సినిమాల జోలికి వెళ్ళకుండా.. తనకంటూ టాలీవుడ్లో ప్రత్యేకమైన ఇమేజ్ సాధించాడీ హీరో. మంచి సినిమావస్తేనే చేస్తానంటూ..పెర్ఫామెన్స్ కు ప్రాధాన్య ఇచ్చే ఈ హీరో పుట్టిన రోజు నేడే. ఫిబ్రవరి 29న పుట్టిన శ్రీవిష్ణు నేటితో 40 ఇయర్స్ లోకి ఎంటర్ అయ్యాడు.
నాలుగేళ్లకు ఒకసారి వచ్చే బర్త్ డే కాబట్టి శ్రీ విష్ణు తన పుట్టిన రోజుని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఈ డేట్ లో పుట్టిన ఏకైక హీరో శ్రీ విష్ణు కావడం విశేషం. అందుకే హీరోలందరిలో చాలా స్పెషల్ హీరో అనిపించుకుంటున్నాడు శ్రీవిష్ణు.
sree vishnu
ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి.. తన టాలెంట్ తో హీరోగా మారాడు శ్రీవిష్ణు. మీడియం రేంజ్ హీరోగా మంచి మంచి సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన సామజవరగమన సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కడుపుబ్బా నవ్వించారు శ్రీవిష్ణు. త్వరలో మార్చ్ 22న ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు.
అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్ లు మాత్రమే కాదు..డిఫరెంట్ టైటిల్స్ తో ఆకట్టుకుంటున్నాడు శ్రీవిష్ణు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వాగ్ అనే మరో కొత్త సినిమా కూడా ప్రకటించారు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శ్రీ విష్ణుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.