సావిత్రి, సౌందర్యలా ఊహించుకున్నాం.. ఇలా చేశారేంటండి.. `టిల్లు స్కైర్‌`లో అనుపమాని చూసి అభిమాని ఆవేదన

Published : Feb 19, 2024, 05:00 PM IST

అనుపమా పరమేశ్వరన్‌ `టిల్లు స్వ్కైర్‌` చిత్రంలో బోల్డ్ గా నటించింది. లిప్‌ కిస్సులతో రెచ్చిపోయింది. దీంతో ఫ్యాన్స్ గుండె పగిలినంత పనైంది. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PREV
19
సావిత్రి, సౌందర్యలా ఊహించుకున్నాం.. ఇలా చేశారేంటండి.. `టిల్లు స్కైర్‌`లో అనుపమాని చూసి అభిమాని ఆవేదన
Tillu square

అనుపమా పరమేశ్వరన్‌ని హోమ్లీ బ్యూటీగా ఆరాధించారు అభిమానులు. కానీ ఆమె ఇటీవల `టిల్లు స్వ్కైర్‌` సినిమాలో లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద షాకిచ్చింది. అసలు ఇది అనుపమా పరమేశ్వరేనా అనే సందేహాలు కలిగేలా చేసింది. దీంతో చాలా మంది అభిమానులు హర్ట్ అయ్యారు. డైహార్డ్ ఫ్యాన్స్ హాట్‌ బ్రేక్‌ అయ్యారు. దీంతో గుండెరోధనతో తమ బాధని వెల్లడించారు. 

29

సోషల్‌ మీడియా వేదికగా తన సెల్ఫీ వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది. ఇందులో అభిమాని మాట్లాడుతూ, తనని ఒక సావిత్రిలా, మరో సౌందర్యలా ఊహించుకున్నామని, కానీ ఇలా చేశారేంటి అని ఆవేదన వెల్లడించారు. తమ హార్ట్ బ్రేక్‌ అయ్యిందని, చూడలేకపోతున్నామని, నచ్చడం లేదని తెలిపాడు. ఎంతో బాధని ఆయన సెల్ఫీ వీడియోతో షేర్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇది నెట్టింట చ్కర్లు కొడుతున్నారు. 

39

మరి ఇంతకు అతను ఏం చెబుతున్నాడు, ఆయన బాధేంటి అనేది చూస్తే.. `ఏంటండి అనుపమ, నా ఆటోలో మీ ఫోటో ఎందుకు వేశానో తెలుసా? ఒకప్పుడు మీరు చేసిన సినిమాలు అలాంటివి అండి. `అ ఆ` సినిమా చూసి మిమ్మల్ని ఇష్టపడని వాళ్లు ఉంటారా?, `శతమానం భవతి` సినిమాలో అసలు మరదలు అంటే మీలా ఉండాలనేలా చేశారు. `అ ఆ`, `శతమానం భవతి`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `హలో గురు ప్రేమకోసమే`.. ఎలాంటి సినిమాలు చేశారండి. 

49

అసలు `హలో గురు ప్రేమకోసమే` సినిమాలో కాఫీ సీన్‌లో మీరా కాదా అనే ఎంతో టెన్షన్‌ పడ్డాం. అలాంటిది అసలు ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నారండి. `రౌడీబాయ్స్`, `టిల్లు 2` ఎందుకండీ మీకు అలాంటి సినిమాలు. ఒకప్పుడు సావిత్రిగారు, సౌందర్యగారు ఎలాంటి సినిమాలు చేశారండి. వారిలాగే మిమ్మల్ని అనుకున్నాం. ఇప్పుడు మీరు ఇలాంటి సినిమాలు చేయడం మాకేం నచ్చడం లేదండి. దయజేసి కొంచెం మంచి మంచి పాత్రలు ఉన్న సినిమాలు చేయండి. ప్లీజ్‌` అంటూ రీక్వెస్ట్ చేశాడు అభిమాని. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది. 
 

59

దీనిపై చాలా మంది నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. సేమ్‌ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆమె ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి పాత్రలు చేయాలనేది ఆమె ఇష్టం అని, చూడాలనుకుంటే చూడు, లేదంటే వదిలేయమని నెటిజన్లు కామెంట్‌ చేయడం గమనార్హం. దీంతో ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌కి సంబంధించిన రచ్చ నడుస్తుంది. 
 

69

అనుపమా పరమేశ్వరన్‌ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న `టిల్లు స్వ్కైర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో సిద్దుతో కలిసి లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. శృతి మించిన ముద్దులతో షాకిచ్చింది. అంతేకాదు రొమాన్స్ లోనూ పీక్‌ చూపించింది. మొన్నటి వరకు హోమ్లీ బ్యూటీగా రాణించిన అనుపమా ఒకేసారి ముద్దులు, రొమాన్స్ అంటూ కనిపించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండె పగిలినంత పనైందంటున్నారు. ఇలా చేయడం న్యాయం కాదంటున్నారు నెటిజన్లు. 
 

79

ఇదిలా ఉంటే ఓ వైపు లేడీ ఓరియింటెడ్‌ మూవీస్ చేస్తూనే ఇలా కమర్షియల్‌ సినిమాలు కూడా చేస్తూ రాణిస్తుంది. ఇప్పుడు బోల్డ్ రోల్స్ చేస్తుంది. గతంలో హోమ్లీ బ్యూటీగా ట్రెడిషనల్‌గా కనిపించే అనుపమా ఇప్పుడు వాటికి బ్రేక్‌ చేసి బోల్డ్‌గా కనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. 
 

89

తాజాగా ఆమె ఫోటో షూట్‌ పిక్స్ పంచుకుంది. వెకేషన్‌లో బికినీలో దిగిన పిక్స్ పంచుకుంది. ఓ వైపు సినిమాల్లో లిప్‌ కిస్సులతో మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ గ్లామర్‌ డోస్‌ పెంచుతూ షాకిస్తుంది. తాజాగా బికినీలో కనిపించింది. వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ఈ ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఆమె ఇలా వెకేషన్‌లో పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. 

99

అనుపమా పరమేశ్వరన్‌ `అ అ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `ప్రేమమ్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స ని అలరించింది. గుర్తింపు తెచ్చుకుంది. `శతమానం భవతి`తో విజయాన్ని అందుకున్నారు. వీటితోపాటు `ఉన్నది ఒక్కటే జిందగీ`, `హలో గురు ప్రేమకోసమే`, `బట్టర్‌ఫ్లై` చిత్రాలతో మెప్పించింది.  `రౌడీ బాయ్స్` తో షాకిచ్చింది. మొదటి లిప్‌ లాక్ని అందులో ప్రయత్నించింది. అప్పుడే దారుణంగా ట్రోల్‌కి గురయ్యింది. ఇప్పుడు `టిల్లు స్వ్కైర్‌`తో మరింత విమర్శలు ఎదుర్కొంటుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories