యాంకర్ ముందే ప్రియుడు పవన్ కళ్యాణ్ కి వాసంతి లిప్ కిస్సులు... సెన్సార్ పెట్టాలి బాబోయ్

First Published | Feb 19, 2024, 4:40 PM IST

బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ ప్రియుడు పవన్ కళ్యాణ్ తో పబ్లిక్ రొమాన్స్ చేసింది. ఇద్దరు లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. లేడీ యాంకర్ చూడలేక కళ్ళు మూసుకునేంత పనైంది. 
 

bigg boss fame vasanthi krishnan public romance with pawan kalyan ksr
Vasanthi Krishnan


బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న వాసంతి కృష్ణన్ పాపులారిటీ తెచ్చుకుంది. హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన వాసంతి 10 వారాలు హౌస్లో ఉంది. వాసంతి గ్లామర్ కి ఒకరిద్దరు మేల్ కంటెస్టెంట్స్ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు. 

వాసంతికి బిగ్ బాస్ పాపులారిటీ తెచ్చింది. వాసంతి క్యాలీఫ్లవర్, అడ్డతీగల సిఎస్ఐ సనాతన్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలేవీ ఆడలేదు. దాంతో వాసంతి కి నటిగా బ్రేక్ రాలేదు. బిగ్ బాస్ షోలో ఛాన్స్ రావడంతో ఎంట్రీ ఇచ్చింది. 
 

వాసంతికి బిగ్ బాస్ పాపులారిటీ తెచ్చింది. వాసంతి క్యాలీఫ్లవర్, అడ్డతీగల సిఎస్ఐ సనాతన్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలేవీ ఆడలేదు. దాంతో వాసంతి కి నటిగా బ్రేక్ రాలేదు. బిగ్ బాస్ షోలో ఛాన్స్ రావడంతో ఎంట్రీ ఇచ్చింది. 


బిగ్ బాస్ షోకి వచ్చాక వాసంతి నటించిన సినిమాల గురించి జనాలకు తెలిసింది. కాగా ఇటీవల వాసంతి ప్రియుడితో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. వాసంతికి కాబోయేవాడి పేరు పవన్ కళ్యాణ్. నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. 
 

Vasanthi Krishnan

పెళ్లి కి ముందే వీరిద్దరూ పబ్లిక్ లో రొమాన్స్ చేయడం చర్చకు దారి తీసింది. ప్రేమికుల రోజు నాడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వాసంతి-పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో వారికి ఒక రొమాంటిక్ టాస్క్ ఇచ్చారు. గిన్నెలో ఉన్న ద్రాక్ష కాయలు... నోటితో పవన్ కళ్యాణ్ లవర్ వాసంతికి తినిపించాలి. 

Vasanthi Krishnan

వీలైనంత తక్కువ సమయంలో ఈ పని చేయాలి. తొందరగా తినిపించాలనే క్రమంలో లిప్ కిస్సులు కూడా  పెట్టేశాడు. వాళ్ళ తీరుకు ఎదురుగా లేడీ యాంకర్ సిగ్గుతో ఇబ్బంది పడింది. కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

యూట్యూబ్ కి కూడా సెన్సార్ తప్పనిసరిగా పెట్టాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. యూట్యూబ్ కంటెంట్ మీద పెద్దగా ఆంక్షలు ఉండవు. అందుకే ఇలాంటి హద్దులు మీరిన రొమాన్స్ కి పాల్పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలం అవుతుండగా  వాసంతి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి...

Latest Videos

click me!