నేడు తారకరత్న పుట్టినరోజు.. బాబాయ్ తో గడిపిన ఆ క్షణాలు తలుచుకుంటున్న ఫ్యాన్స్, వైరల్

Published : Feb 22, 2023, 10:02 AM IST

నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు.

PREV
16
నేడు తారకరత్న పుట్టినరోజు.. బాబాయ్ తో గడిపిన ఆ క్షణాలు తలుచుకుంటున్న ఫ్యాన్స్, వైరల్

నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. హీరోగా రాణించిన తారక రత్న రాజకీయాల్లో కూడా తన మార్క్ ప్రదర్శించాలనుకున్నారు. కానీ అనుకోకుండా లోకేష్ పాదయాత్రలో తారకరత్న గుండె సమస్యతో సొమ్మసిల్లి పడిపోవడం, 23 రోజుల తర్వాత మృత్యువాత పడడం జరిగింది. 

26

నేడు నందమూరి తారకరత్న 40వ పుట్టినరోజు. ఆయన జయంతి సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మరోసారి ఎమోషనల్ గా తారక రత్నని గుర్తు చేసుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్యంగా బతికి ఉంటే.. ఆయన పుట్టినరోజు వేడుకలో వైభవంగా జరిగేవి. కానీ తారకరత్న కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య లేరు. 

36

దీనితో తారకరత్నని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతున్నారు. గతంలో తారక రత్న తన బర్త్ డేని తాను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే బాబాయ్ బాలయ్యతో జరుపుకున్నారు. ఆ ఫొటోస్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తున్నారు. 

46

బాలయ్యపై తారకరత్నకి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారకరత్న ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ముందుండి బాలయ్య సపోర్ట్ అందించారు. బాబాయ్ పై ప్రేమతో తారకరత్న చేతిపై బాలకృష్ణ సంతకాన్ని, సింహం బొమ్మని టాటూగా వేయించుకున్నారు. 

56

గతంలో తారకరత్న తన పుట్టిన రోజు వేడుకల్ని బాలయ్య, నారా రోహిత్, తన సతీమణి అలేఖ్య రెడ్డి మధ్య ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. ఆ సంతోష క్షణాలు ఇప్పుడు లేవని అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకం అనుభవిస్తున్నారు. 

66

తారకరత్న తన బాబాయ్ బాలయ్యతో ఎప్పటికైనా ఒక చిత్రంలో నటించాలని అనుకునేవారు. పలు ఇంటర్వ్యూలలో తన కోరిక బయట పెట్టారు. బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న ఎన్బికే 108లో తారకరత్నకి ఒక పాత్ర సిద్ధం చేయడానికి చర్చలు కూడా జరిగాయట. కానీ ఇంతలోనే ఈ విషాదం జరిగింది. 

Read more Photos on
click me!

Recommended Stories