కాబోయే వాడితో అమెరికా షిఫ్ట్ అవుతున్న `బిగ్ బాస్‌` బ్యూటీ ప్రియాంక జైన్‌.. బాబోయ్‌ ఇదేం ట్విస్ట్..

Published : Jan 12, 2024, 07:02 PM ISTUpdated : Jan 12, 2024, 07:03 PM IST

కాబోయే వాడితో కలిసి అమెరికా షిఫ్ట్ అవుతున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్‌. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ అందులో పెద్ద ట్విస్ట్ ఇచ్చిందీ బ్యూటీ.   

PREV
17
కాబోయే వాడితో అమెరికా షిఫ్ట్ అవుతున్న `బిగ్ బాస్‌` బ్యూటీ ప్రియాంక జైన్‌.. బాబోయ్‌ ఇదేం ట్విస్ట్..
Priyanka Jain

ప్రియాంక జైన్‌.. సీరియల్స్ లో రాణించిన ఈ బ్యూటీ `బిగ్‌ బాస్‌ తెలుగు 7`తో పాపులర్‌ అయ్యింది. మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆమె బిగ్‌ బాస్‌ షోలో టాప్‌ 6 కంటెస్టెంట్‌గా నిలిచింది. టాప్‌ 5 వరకు వెళ్లింది. సొట్టబుగ్గల అందంతో బిగ్‌ బాస్‌ షోకి అందాన్ని తీసుకొచ్చింది. కొంత ఫెయిర్‌, ఇంకొంత అన్‌ ఫెయిర్‌ గేమ్‌తో కాస్త హాట్‌ టాపిక్‌ అయ్యింది. `స్పా` బ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించింది. 
 

 

27
Priyanka Jain

ఏదేమైనా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకుంది ప్రియాంక జైన్‌. అయితే అదే బిగ్‌ బాస్‌ షోలో తన లవ్‌ స్టోరీ బయటపెట్టిన విషయం తెలిసిందే. మరో సీరియల్‌ నటుడు శివ్‌ కుమార్‌ని ఆమె ప్రేమిస్తుంది. ఈ ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇన్నాళ్లు గోప్యంగా ఉంచినా, బిగ్‌ బాస్‌ వేదికగా తన ప్రేమ వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. రొమాంటిక్‌గా తమ ప్రేమ విషయాన్ని చెప్పింది. 

 

37
Priyanka Jain

అయితే మధ్యలో తన ప్రియుడు కూడా ఆమె కోసం బిగ్‌ బాస్‌ షోకి రావడం విశేషం. ఫ్యామిలీ వీక్‌లో ఆయన సందడి చేశాడు. అందరిని `సర్‌` అంటూ పలకరిస్తూ, అందరి గురించి గొప్పగా చెబుతూ స్పెషల్‌గా నిలిచాడు. అందరిలో బెస్ట్ ఫ్యామిలీ మెంబర్‌ అనిపించుకున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రియాంక, శివ్‌ ముద్దులతో రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపిస్తూ బిగ్‌ బాస్‌ హౌజ్‌ ని రొమాంటిక్‌ హబ్ గా మార్చేశారు. 
 

 

47
Priyanka Jain

అయితే ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది ప్రియాంక జైన్‌. ఇప్పుడే పెళ్లిచేసుకో అని కూడా ఆమె ఫోర్స్ చేయడం, షో నుంచి బయటకు వచ్చాక చేసుకుందామని ఆయన చెప్పడం విశేషం. అయితే ఇక త్వరలోనే ఈ ఇద్దరి పెళ్లి ఉంటుందని భావించారు. కానీ ఈ బ్యూటీ ఇప్పుడు ఓ సడెన్‌ ట్విస్ట్ ఇచ్చింది. కాబోయే వాడితో కలిసి అమెరికా చెక్కేస్తుంది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. 

 

57
Priyanka jain

తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ప్రియాంక జైన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చింది. తాము అమెరికా షిఫ్ట్ అవుతున్నామని ముందుగా పేర్కొన్నారు. కానీ వీడియోలో క్రమంగా ఒక్కో విషయాన్ని రివీల్‌ చేశారు. ఇకపై ఈ ఇద్దరు అమెరికాకి వెళ్లిపోతున్నారు, అక్కడే ఉంటామనే అర్థం వచ్చేలా కలరింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా అసలు విషయాన్ని రివీల్‌ చేశారు. అమెరికా వెళ్లేది శివ్‌ ఒక్కడే అట. 
 

67

అయన వీసా కోసం అప్లై చేయగా, ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ రమ్మన్నారు. అందుకోసం ప్రియుడితో కలిసి ఢిల్లీ వెళ్తూ ఎయిర్‌ పోర్ట్ లో దిగిన ఫోటోని పంచుకున్నారు. అక్కడ శివ్‌ ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఆయనకు వీసా రావడం కూడా జరిగింది. త్వరలోనే ఆయన అమెరికా వెళ్తారట. రెండు నెలలపాటు ఆయన అమెరికాలో ఉంటారట. ఆయనకోసమే ఇదంతా అని తెలిపారు. అయితే ఎందుకోసమని తెలియాల్సి ఉంది. కానీ వీళ్లు ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అభిమానులను షాక్‌కి గురి చేస్తుంది. ఇక ఈ ఇద్దరు అమెరికా వెళ్లిపోతున్నారని, అక్కడేసెటిల్‌ అవుతారేమో అనేలా కలరింగ్ ఇవ్వడం విశేషం. 
 

77

ఇక ఇప్పుడు ప్రియాంక జైన్‌ వరుసగా టీవీ షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది. అలాగే మళ్లీ సీరియల్స్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ మల్టీఫుల్‌ పనుల్లో బిజీగా ఉంది ప్రియాంక. తరచూ తమ స్పా బ్యాచ్‌తో కలిసి పార్టీలతో ఎంజాయ్‌ చేస్తున్నారు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories