టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన 'మంచి రోజులొచ్చాయి' అనే చిత్రంలో నటించింది.