Liger vs Agent: విజయ్ దేవరకొండ వర్సెస్ అక్కినేని అఖిల్... ఫ్యాన్స్ కి మతిపోయిందా? 

Published : Apr 21, 2022, 04:03 PM IST

ఫ్యాన్ వార్స్ జనాలకు కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటే కలెక్షన్స్ లెక్కలు, సిల్వర్ జూబ్లీ సినిమాలను తెరపైకి తెచ్చి కొట్టుకుంటూ ఉంటారు.   

PREV
17
Liger vs Agent: విజయ్ దేవరకొండ వర్సెస్ అక్కినేని అఖిల్... ఫ్యాన్స్ కి మతిపోయిందా? 
Akhil -Vijay


సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్ కొత్తకోణం తీసుకుంది. లక్షల మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యుద్ధానికి దిగి, మానసిక దాడి చేసుకుంటున్నారు. బూతులు తిట్టుకోవడం, ఎగతాళి చేసుకోవడం, మీమ్స్, ట్రోల్స్ తో పరస్పరం వాదనకు దిగుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో ఇద్దరు యంగ్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. 

27
Akhil -Vijay


విజయ్ దేవరకొండ వర్సెస్ అఖిల్ అక్కినేని అన్నట్లుగా పరిస్థితి మారింది. ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ పోల్స్ నిర్వహిస్తున్నారు. ఆయనకు రీట్వీట్, ఈయనకు లైక్ అంటూ పోటీలు నిర్వహిస్తున్నారు. విజయ్ లైగర్(Liger), అఖిల్ ఏజెంట్ పోస్టర్స్ పోస్ట్ చేసి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 
 

37
Akhil -Vijay


ఈక్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటున్నారు. అసలు ఈ ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటో అర్థం కావడం లేదు. వీరిద్దరూ యంగ్ హీరోలనే ఓ కామన్ పాయింట్ తప్పితే ఇమేజ్, పాపులారిటీలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. 

47
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఇమేజ్ లో స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు. యూత్, అమ్మాయిల ఫాలోయింగ్ అతని స్ట్రెంగ్త్. అనతి కాలంలోనే పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళాడు. విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్ రీత్యా కోకా కోలా లాంటి గ్లోబల్ బ్రాండ్స్ సైతం అంబాసర్ గా పెట్టుకుంటున్నాయి. దర్శకుడు పూరితో విజయ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ హిట్ అయితే.. అతడి ఇమేజ్ మరో లెవెల్ కి చేరుతుంది. 

57

ఇక అఖిల్ (Akhil Akkineni) విషయానికి వస్తే.. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభం కూడా సరిగాలేదు. వరుసగా మూడు ప్లాప్స్ తర్వాత నాలుగో ప్రయత్నంలో హిట్ అందుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంతో అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కినేని వారసుడిగా నాగార్జున ఫ్యాన్స్ ఆయన్ని అభిమానిస్తున్నారు.

67

అయితే ఓ స్థాయి ఇమేజ్, స్టార్డం అతడు ఇంకా తెచ్చుకోలేదు. అన్నయ్య నాగ చైతన్య మాస్ హీరోగా ఎదగలేకున్నా... పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. ఆయనకంటూ మార్కెట్ ఏర్పడింది. అఖిల్ ఆ రేంజ్ హీరోగా కూడా కాలేదు. అయితే అక్కినేని అభిమానులు ఏజెంట్ (Agent) మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీ అఖిల్ కి పెద్ద బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. 

77


ఇక వాస్తవం మాట్లాడుకోవాలంటే విజయ్ తో పోటీపడే స్థాయికి అఖిల్ ఇంకా ఎదగలేదు. నాగ చైతన్యతో పాటు నాని, వరుణ్ తేజ్, ధరమ్, శర్వానంద్ వంటి టూ టైర్ హీరోలందరూ విజయ్ దేవరకొండ తర్వాత. టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోలలో విజయ్ 6-7 స్థానాల్లో ఉంటారు. కాబట్టి అఖిల్ ఫ్యాన్స్ తామేంటో నిరూపించుకోకుండా ఇలా అనవసరపు పోటీకి దిగడంలో అర్ధం లేదు. 
 

click me!

Recommended Stories