మతానికి కాదు టెర్రరిజంకి వ్యతిరేకం
ఇప్పటి పరిస్థితుల్లో పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ ఉంటోంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేరళ స్టోరీ చిత్రంపై ఎక్కువగా పాజిటివిటీనే ఉంది. ప్రతి రోజు నాకు అనేక మెసేజ్ లు వస్తున్నాయి. అందులో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారే ఉన్నారు. నెగిటివిటి కూడా ఉంది. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి అపార్థం చేసుకుంటున్న వారు ఉన్నారు. నా తల్లిదండ్రుల నుంచి ప్రతి ఒకరి అభిప్రాయాన్ని గౌరవించే గుణం నేర్చుకున్నా. కాబట్టి వారందరికీ ఒక్క టే చెబుతున్నా.. రెండు గంటల సమయం తీసుకుని ఈ చిత్రం చూడండి. ఒక్క సన్నివేశంలో కూడా కేరళని బ్యాడ్ గా చూపించలేదు అని రియలైజ్ అవుతారు. కేరళ గౌరవం తగ్గించే సన్నివేశం ఒక్కటి కూడా లేదు.
మనం మన ఆలోచనలని, భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తపరచగలిగే దేశంలో ఉన్నాం. ఈ చిత్రంలో షాలిని పాత్ర కనీసం సొంతంగా ఆలోచించలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. ఈ చిత్రం ఎన్నికల గురించో, రాజకీయాల గురించో కాదు. ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ చిత్రం టెర్రరిజం వర్సెస్ మానవత్వం గా ఉంటుంది.