Folk Songs: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తనదైన స్టెప్పులు, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈశ్వర్ సాయి. యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న ఈశ్వర్ సాయి టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఏవో తెలుసుకుందాం.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ఫోక్ సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఫోక్ సాంగ్స్‌లో తమ డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. అలాంటి వారిలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి ఒకరు. తనదైన డ్యాన్స్ స్టైల్, ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆయన ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు ఈశ్వర్. మరి యూట్యూబ్‌లో అదరగొడుతున్న ఈశ్వర్ సాయి టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
26
బాసింగా బలాలే పాట
ఈశ్వర్ సాయి పేరు చెప్పగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పాట 'బాసింగా బలాలే'. ఈ పాటలో ఆయన వేసిన స్టెప్పులు, ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పాటలోని హుషారైన బీట్, తెలంగాణ యాసలో సాగే లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ పాటలో ఈశ్వర్ సాయితో పాటు వైష్ణవి సోనీ కూడా నటించారు. ఈ పాట యూట్యూబ్ లో 240 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
36
రాతిరి రాతిరి రాతిరిలో
ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి నటించిన పాటల్లో 'రాతిరి రాతిరి రాతిరిలో' సాంగ్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ పాటలో రొమాంటిక్ టచ్‌తో కూడిన తెలంగాణ ఫోక్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ, డ్యాన్స్ స్టెప్పులు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. పాటలోని క్యాచీ లిరిక్స్, మ్యూజిక్ వల్ల సోషల్ మీడియాలో ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.
మాస్ బీట్, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు ఇష్టపడేవారికి 'సీటీ చీర' పాట బాగా నచ్చుతుంది. ఈ పాటలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ తమదైన స్టైల్లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ బీట్ కి అనుగుణంగా వేసిన స్టెప్పులు ప్రేక్షకులను అలరిస్తాయి. పల్లెటూరి వాతావరణం, తెలంగాణ జానపద శైలి ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు.
56
ప్రమీల పాట
ఈశ్వర్ సాయి నటించిన ఫోక్ సాంగ్స్‌లో 'ప్రమీల సాంగ్' కూడా ప్రేక్షకులకు బాగా పరిచయమైన పాట. ప్రేమ భావాలతో పాటు పల్లెటూరి నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. పాటలోని లిరిక్స్, సంగీతం, డ్యాన్స్ కలిపి మంచి వినోదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ఈశ్వర్ సాయి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. ఈ పాట యూట్యూబ్‌లో 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
66
సన్న సన్న బియ్యమే
ఈశ్వర్ సాయి అభిమానులు తప్పకుండా వినే మరో పాట 'సన్న సన్న బియ్యమే'. తెలంగాణ జానపద సంగీతంలోని ప్రత్యేకమైన బీట్, పల్లెటూరి యాస ఈ పాటలో కనిపిస్తాయి. పంబల రమేష్ సాహిత్యం అందించగా, శిరీష, గంగమణి ఆలపించారు. వెంకట్ అజ్మీర సంగీతం అందించారు. యూట్యూబ్‌లో 40 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట ఫోక్ మ్యూజిక్ అభిమానుల్లో మంచి ఆదరణ పొందుతోంది.