వర్ష దక్కడం లేదంటూ ఇమ్మాన్యుయెల్‌ విరహ వేదన.. పాట పాడుతూ `జబర్దస్త్` కమెడియన్ ఎమోషనల్‌

Published : Nov 04, 2022, 08:22 PM IST

`జబర్దస్త్` షో ప్రేమ జంటలకు కేరాఫ్‌గా నిలుస్తూ వస్తోంది. ఇందులో ఇప్పటి వరకు నాలుగైదు జంటలు తయారయ్యాయి. అందులో ఇమ్మాన్యుయెల్‌, వర్షల జోడి ప్రత్యేకమైనది. కానీ ఇప్పుడు వారి ప్రేమ బ్రేకప్‌ స్టోరీగా మారుతుందా? ఇమ్మూకి వర్ష దూరమవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

PREV
17
వర్ష దక్కడం లేదంటూ ఇమ్మాన్యుయెల్‌ విరహ వేదన.. పాట పాడుతూ `జబర్దస్త్` కమెడియన్ ఎమోషనల్‌

`జబర్దస్త్`లో వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జోడీ ఇప్పటికీ పాపులర్‌. ఇద్దరు కలిసి స్కిట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నవ్వులు పూయిస్తున్నారు. ఈ జోడి మధ్య కెమిస్ట్రీ బాగా పడుతుండటంతో, పైగా ఈ జంట మధ్య లవ్‌ ట్రాక్‌ కూడా క్రేజ్‌ని సొంతం చేసుకోవడంతో మల్లెమాల టీమ్‌ కూడా బాగా వాడుకుంటున్నారు. వీరిద్దరి ప్రపోజల్స్ స్కిట్లని, అలాగే ఎంగేజ్‌మెంట్లు, పెళ్లిళ్లు కూడా చేశారు. ఆయా ఎపిసోడ్లకి మంచి టీఆర్‌పీ వచ్చింది. 
 

27

ఇప్పటికీ దాన్ని వాడుకుంటున్నారు. అయితే మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత వాళ్లు స్కిట్లు చేస్తున్నారు కానీ మళ్లీ లవ్‌ ట్రాక్‌లు పెట్టడం లేదు. దీంతో చాలా రోజులుగా ఆ వెలితి ఉండిపోయింది. తాజాగా మరోసారి రెచ్చిపోయారు. తమ ప్రేమని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తనలో దాచుకున్న ప్రేమని బయటపెట్టాడు. తన మనసులోని బాధని వెల్లడించాడు ఇమ్మాన్యుయెల్.  వర్ష తనకు దక్కడం లేదనే అర్థంలో ఇమ్మూ పాట పాడారు.
 

37

తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మరోసారి వీరిద్దరి లవ్ మ్యాటర్ చర్చకొచ్చింది. రష్మి యాంకర్‌గా రన్‌ అవుతున్న ఈ షోలో ఇంద్రజ జడ్జ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఓ ప్రేమ విషాద గీతం ఆలపించారు ఇమ్మాన్యుయెల్‌. `నా ఆటోగ్రాఫ్‌` చిత్రంలోని `నువ్వంటే ప్రాణమని.. `అనే పాటని పాడారు. వర్షని ఉద్దేశించి ఇమ్మూ ఈ విషాద పాటని ఆలపించారు. 
 

47

ఇమ్మాన్యుయెల్‌ పాట పాడుతున్నంత సేపు వర్ష మొఖం వాడిపోయినట్టుగా, బాధతో కనిపించింది. కెమెరా కూడా ఆమెపైనే చూపించారు. దీంతో వర్షని ఉద్దేశించే ఇమ్మాన్యుయెల్‌ పాడుతున్నారని అందరికి అర్థమైపోయింది. బ్యాక్‌ డ్రాప్‌లో వర్ష, ఇమ్మాన్యుయెల్‌ లు కలిసి గతంలో పాడుకున్న డ్యూయెట్లు, పెళ్లి సీన్లని చూపించారు. అవి ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా ఉండటం విశేషం. 
 

57

అనంతరం ఎందుకు ఇలా పాడాల్సి వచ్చిందో తెలిపాడు ఇమ్మాన్యుయెల్‌. యాంకర్‌ రష్మి అడిగిన దానికి ఆయన రియాక్ట్ అయ్యారు. ఏమైందని ఇంద్రజ అడగ్గా, అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదా మీ మధ్య అని రష్మి అడగ్గా, ఎప్పటికీ మారదేమో అనిపించింది. అందుకే ఇలా పాట పాడినట్టు తెలిపాడు జబర్దస్త్ కమెడియన్‌. దీంతో అటు రష్మి, ఇటు ఇంద్రజ కూడా షాక్‌ అయ్యారు. 

67

ఏమైంది వర్ష అని ఇంద్రజ అడగ్గా స్టేజ్‌ మీదున్న వర్ష.. తలదించుకోవడం ఆశ్చర్యపరిచింది. నెల మొఖం వేసి ఆమె ఏం స్పందించకపోవడంతో అంతా షాక్‌ అవుతున్నారు. వర్షపై ఇమ్మాన్యుయెల్‌కి ప్రేమ ఉందని అర్థమవుతుంది. కానీ వర్ష వైపు నుంచి ఆ రియాక్షన్‌ లేదని, ఆమె ఇమ్మూకి దూరం కావాలనుకుంటుందా? అనేట్టుగా ఈ సీన్‌ క్రియేట్‌ కావడం షాక్‌కి గురి చేస్తుంది. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. 

77

లేటెస్ట్ గా విడుదలైన ఈ `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇది ఆదివారం ఈటీవీలో ప్రసారం కానుంది. మరి ఆ రోజుగానీ ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజంగానే ఏదైనా ఉందా? లేక ఇది కూడా రెగ్యూలర్‌ హడావుడి మాత్రమేనా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్‌ చేయాల్సిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories