Varsha: నా రాముడు ఆయనే, ఇమ్మాన్యూల్ కాళ్ళు మొక్కిన వర్ష.. వ్యవహారం బాగా ముదిరిందిగా

Published : Apr 10, 2022, 07:45 AM IST

వర్ష, ఇమ్మాన్యూల్ బుల్లి తెరపై క్రేజీ జంటగా పాపులర్ అయ్యారు. సుధీర్, రష్మీకి ఎలాంటి పాపులారిటీ దక్కిందో వర్ష, ఇమ్మాన్యూల్ కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. 

PREV
17
Varsha: నా రాముడు ఆయనే, ఇమ్మాన్యూల్ కాళ్ళు మొక్కిన వర్ష.. వ్యవహారం బాగా ముదిరిందిగా
Jabardasth Varsha

వర్ష, ఇమ్మాన్యూల్ బుల్లి తెరపై క్రేజీ జంటగా పాపులర్ అయ్యారు. సుధీర్, రష్మీకి ఎలాంటి పాపులారిటీ దక్కిందో వర్ష, ఇమ్మాన్యూల్ కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య రొమాన్స్ సాగుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. కెమెరా ముందు కూడా వీరిద్దరూ సరదాగా ప్రేమికుల తరహాలో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. 

 

27
Jabardasth Varsha

నేడు శ్రీరామనవమి సందర్భంగా బుల్లితెరపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఓ ఛానల్ లో అనసూయ యాంకర్ గా 'సీతారాముల కళ్యాణం చూతము రారండి' అనే కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాంని కలర్ ఫుల్ గా, కనుల పండుగగా ప్లాన్ చేశారు. తాజాగా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలయింది. 

 

37
Jabardasth Varsha

ఈ ప్రోమోలో వర్ష, ఇమ్మాన్యూల్ మధ్య జరిగే సంభాషణ చూస్తుంటే లవ్ ఎఫైర్ లో వీరిద్దరూ చాలా దూరం వెళ్లిపోయారుగా అనే అనుమానం కలగక మానదు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ అనసూయ ఒక చిన్న గేమ్ పెడుతుంది. రాముడు, సీత అని రాసి ఉన్న స్లిప్స్ ని మిక్స్ చేసి ఉంచుతారు. 

 

47
Jabardasth Varsha

ఈ గేమ్ లో పాల్గొనే వారు ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ తీసుకోవాలి. ఆ స్లిప్స్ లో రాముడు పేరు వచ్చిన వారు.. సీత పేరు ఉన్న స్లిప్ ఎవరి వద్ద కనిపెట్టాలి. రాముడు సీతని కనిపెడితే.. సీత చెంబుడు పానకం తాగాలి.. కనిపెట్టలేక పోతే రాముడే ఆ పని చేయాలి అని అనసూయ చెబుతుంది. 

 

57
Jabardasth Varsha

అనుకోని విధంగా రాముడు స్లిప్ వర్ష కు వస్తుంది. సీత పేరున్న స్లిప్ ఇమ్మాన్యూల్ కి వస్తుంది. కానీ వర్ష.. ఇమ్మాన్యూల్ ని కనిపెట్టలేక పోతుంది. దీనితో నేనే సీత అంటూ వర్ష చేత పానకం తాగించేందుకు ఇమ్మాన్యూల్ ముందుకు వస్తాడు. స్లిప్ లో మాత్రమే నేను రాముడిని.. కానీ నిజానికి ఈయనే రాముడు, నేను సీత అని చెబుతుంది. 

 

67
Jabardasth Varsha

అయితే కాళ్ళు పెట్టుకో ని ఇమ్మాన్యూల్ అంటాడు.. వర్ష సంప్రదాయంగా ఇమ్మాన్యూల్ కాళ్ళు మొక్కుతుంది. ఇమ్మాన్యూల్ వర్షని ఆశీర్వదించి కౌగిలించుకుంటాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటన చూడ ముచ్చటగా ఉంది. వీరిద్దరూ ప్రేమలో నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోయారు.. వ్యవహారం బాగా ముదిరింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

 

77
Jabardasth Varsha

ఆన్ స్క్రీన్ పై ఇమ్మాన్యూల్, వర్ష జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వర్ష అందంగా లంగాఓణీలో మెరిసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. 

 

click me!

Recommended Stories