Kangana Ranaut :‘ఎమర్జెన్సీ’అన్ని కోట్లు నష్టమా?, కంగనాకు పెద్ద దెబ్బే

Published : Feb 22, 2025, 08:15 AM ISTUpdated : Feb 22, 2025, 08:17 AM IST

 Kangana Ranaut : కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా నిర్మాణానికి రూ.75 కోట్లు ఖర్చు కాగా, కేవలం రూ.21 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఓటీటీ హక్కులు కూడా తక్కువ ధరకు అమ్ముడుపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది.

PREV
14
  Kangana Ranaut :‘ఎమర్జెన్సీ’అన్ని కోట్లు నష్టమా?,  కంగనాకు పెద్ద దెబ్బే
Emergency not a profitable venture for producers including Kangana Ranaut in telugu


 Kangana Ranaut : బాలీవుడ్‌  హీరోయిన్ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్, శ్రేయాస్‌ తల్పాడే, మహిమా చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జనవరి 17న విడుదలై డిజాస్టర్ టాక్ అందుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కానున్నట్లు సోషల్ మీడియా  వేదికగా ప్రకటించింది కంగన. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మార్చి 17నుంచి ప్రసారం కానున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఈ సినిమా  పేరు చెప్పి నిర్మాతగా కంగన ఎంత నష్టపోయిందనే లెక్కలు బయిటకు వచ్చాయి.
 

24
Emergency not a profitable venture for producers including Kangana Ranaut in telugu


మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని రూపొందించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దీనిని సిద్ధం చేశారు. ఇందిరాగాంధీగా కంగనా నటించగా.. జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.   రూ.60 కోట్లతో దీనిని రూపొందించగా.. పబ్లిసిటీ,కొన్ని చోట్ల సొంత రిలీజ్ లు కలిపి మరో పదిహేను కోట్లు దాకా అయ్యాయని మొత్తం 75 కోట్లు దాకా ఖర్చు అయ్యిందని  తెలుస్తోంది.  

34
Emergency not a profitable venture for producers including Kangana Ranaut in telugu


అయితే సినిమా రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్ రావటంతో  అన్ని కలిపి రూ.21 కోట్లు మాత్రమే ఈ సినిమా రాబట్టినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఈ స్దాయి ఫ్లాఫ్ అయిన ఈ సినిమాకు ఓటిటి సంస్దలు కూడా  ఎక్కువ ఇవ్వలేదని, చాలా తక్కువ మొత్తానికే పది కోట్లు లోపే  తీసుకున్నట్లు తెలుస్తోంది.

దాంతో కంగనా, ఆమె నిర్మాతలు కలిపి 45 కోట్లు దాకా  నష్టపోయారని బాలీవుడ్ మీడియా అంటోంది.  ఈ సినిమా నిమిత్తం ఆమె ఇల్లు కూడా తాకట్టు పెట్టేసారు. 

44
Emergency not a profitable venture for producers including Kangana Ranaut in telugu

భారతీయ చరిత్రలో ముఖ్యమైన అధ్యాయం.. 1975 దేశంలోని అత్యవసర పరిస్థితి సందర్భం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. అస్సాంను ఆక్రమించుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలను ఇందిరా గాంధీ ఎలా తిప్పికొట్టింది?

ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం? సిమ్లా ఒప్పందం? దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎమర్జెన్సీ విధించడానికి కారణమయ్యాయి? ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సమయంలో ఇందిర తీసుకున్న చర్యలు ఏమిటి? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ చిత్రం. 
.
 

Read more Photos on
click me!

Recommended Stories