Sandeep Kishan: తల పట్టుకున్న సందీప్ కిషన్ , చిన్న విషయానికి ఇంత రచ్చా?!

Published : Feb 22, 2025, 07:24 AM IST

Sandeep Kishan: సందీప్ కిషన్ తనకు సైనస్ సమస్య ఉందని, దానివల్ల తలనొప్పి వస్తుందని చెప్పాడు. దీనికి సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే మీడియా దీనిని పెద్ద సమస్యగా చూపిస్తోంది.

PREV
13
Sandeep Kishan: తల పట్టుకున్న  సందీప్  కిషన్ , చిన్న విషయానికి ఇంత రచ్చా?!
Sandeep Kishan revealed that he suffers from sinus issues in telugu


Sandeep Kishan: మీడియా ఏదైనా సెన్సేషన్ వార్త కోసం ఎదురుచూస్తుంటుంది. చిన్న క్లూ దొరికితే దాన్ని చింపి చేటంత చేసే దాకా మనస్సాంతి ఉండుదు. ఇప్పుడు సందీప్ కిషన్ హెల్త్ ఇష్యూ గురించి మీడియా మొత్తం రచ్చ జరుగుతోంది. చాలా పెద్ద సమస్యగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తన తాజా చిత్రం  “మజాకా” రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ క్యాజువల్ గా రివీల్ చేసిన విషయాన్ని పెద్దది చేస్తోంది. ఇది చూసిన సందీప్ కిషన్, సినిమా టీమ్ తల పట్టుకున్నాడట. సినిమా గురించి మాట్లాడటం మానేసి జనం ఈ విషయం గురించి చర్చించుకునేలా మీడియాప్రొజెక్ట్ చేస్తున్నారే  అని బాధపడుతున్నారట. ఇంతకీ సందీప్ కిషన్ చెప్పిన హెల్త్ ఇష్యూ ఎవరికీ ప్రపంచంలో రానిదా 
 

23
Sandeep Kishan revealed that he suffers from sinus issues in telugu

 
సందీప్ కిషన్ కు చాలా మందికి ఉన్నట్లే  తీవ్రమైన సైనస్ సమస్య ఉందట. దాని వల్ల మెడ-తల చుట్టూ విపరీతమైన పెయిన్ వస్తుందని చెప్పుకొచ్చాడు. అది మందులతో పోయేది కాదంట. కచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనని అన్నారు.

ఈ సమస్య వల్ల ఒక్కోసారి తను చిరాగ్గా ఉంటానని, ఆ టైమ్ లో తనను చూసిన వాళ్లు సహచర నటీనటులు, టెక్నీషియన్స్ తో సరిగ్గా ఉండనంటూ ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు. షాట్ గ్యాప్ లో కారవాన్ లోకి వెళ్లిపోతాడని, ఎవ్వరితో కలవడనే రూమర్స్ కూడా ఉన్నాయి. వీటికి కూడా కారణం సైనస్ అని, కారవాన్ లోకి వెళ్లి ఓ  అరగంట పడుకుంటే రిలాక్స్ గా ఉంటుందని చెబుతున్నాడు.

33
Sandeep Kishan revealed that he suffers from sinus issues in telugu


సర్జరీ అంటే తనకు భయమని, పైగా ఇన్నాళ్లూ బిజీగా ఉండడం వల్ల సర్జరీ గురించి ఆలోచించలేదని అన్నాడు. “మజాకా” సినిమా రిలీజ్ తర్వాత తన ఆరోగ్యంపై దృష్టిపెడతానంటున్నాడు సందీప్ కిషన్. అయితే ఈ మేటర్ ని పట్టుకుని సందీప్ కిషన్ కు ఏదో తీరని హెల్త్ ఇష్యూ వచ్చినట్లు హెడ్డింగ్ లు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్ లో ఏ ఎలిమెంట్ హైలెట్ కానంతగా దీన్నే మాట్లాడుతున్నారు. ఏం  హీరోహీరోయిన్లు కూడా మనుషులే కదా. వాళ్లకూ చిన్న చిన్న  ఆరోగ్య సమస్యలుంటాయి. అయితే చాలా మంది  పైకి   చెప్పుకోరు. కొందరు హీరోలు  సీక్రెట్ గా విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని వస్తుంటారు. సందీప్ కిషన్ మాత్రం   ఓపెన్ చేసి చెప్పినందుకు ఇలా రచ్చ జరుగుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories