వెకేషన్‌లో ఈషారెబ్బా హంగామా.. ఐస్‌క్రీమ్‌ తీంటూ న్యూయార్క్ రోడ్లపై నాన్‌స్టాప్‌ రచ్చ..

Published : Apr 12, 2023, 03:53 PM IST

తెలుగు హాట్‌ అందం ఈషా రెబ్బా సినిమాల్లో కంటే ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంది. ఆమె ఫోటో షూట్లతో అలరిస్తుంది. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది.   

PREV
18
వెకేషన్‌లో ఈషారెబ్బా హంగామా.. ఐస్‌క్రీమ్‌ తీంటూ న్యూయార్క్ రోడ్లపై నాన్‌స్టాప్‌ రచ్చ..

ఈషా రెబ్బా తాజాగా ఆమెరికా రోడ్లపై హంగామా చేస్తుంది. వైట్‌ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించి రచ్చ చేస్తుంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఈషా రెబ్బా. 
 

28

తెలుగు అందం ఈషా.. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంది. అక్కడి రోడ్లపై రచ్చ చేస్తుంది. తన ఫ్రెండ్‌తో కలిసి నాన్‌ స్టాప్ గా ఎంజాయ్‌ చేస్తుంది. ఐస్‌ క్రీమ్‌ ఆరగిస్తూ న్యూయార్క్ వీధుల్లో కలియ తిరిగింది. సమ్మర్‌ వేళ అక్కడ కూలింగ్‌ని ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతుంది ఈషా రెబ్బా. 
 

38

తన ఫోటోలను పంచుకోవడమే కాదు, అక్కడి అందాలను కూడా తన ఫోటోల్లో బంధించి వాటిని అభిమానులతో పంచుకుంది. దీంతో ఇప్పుడు ఈషారెబ్బా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఈషా రెబ్బా లుక్‌ కూడా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. 

48

తెలుగు అందం ఈషా రెబ్బా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించలేకపోతుంది. ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. ఇతర భాషల్లో ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.అడపాదడపా ఇతర భాషల్లోనే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తుండటం గమనార్హం. 
 

58

తెలుగులో ఈషా రెబ్బా చాలా సినిమాలే చేసింది. అందులో మంచి సినిమాలు, మంచి విజయాలు సాధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. `అంతకు ముందు ఆ తర్వాత` సినిమాకి ఆమెకి మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఈ చిత్రంతోనే ఈషా రెబ్బా అందరి దృష్టిలో పడింది. మంచి ఇమేజ్‌ కూడా ఏర్పడింది. 

68

దీంతో ఇక ఈషా రెబ్బాకి వరుసగా అవకాశాలు వస్తాయని భావించారు. బిజీ హీరోయిన్‌ అవుతుందనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆఫర్లు వచ్చాయి. కానీ అన్నీ చిన్న సినిమాలే. పెద్ద సినిమాల్లో మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గా రాలేదు. కేవలం సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలు, అలా మెరిసే పాత్రలే దక్కాయి. 

78

దీంతో ఆయా సినిమాలు పెద్ద విజయాలు సాధించినా, ఆ క్రెడిట్‌ మాత్రం ఈ బ్యూటీకి దక్కలేదు. అందులో ఎన్టీఆర్‌తో నటించిన `అరవింద సమేత`, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` వంటి చిత్రాలను చెప్పొచ్చు. వీటితోపాటు `అ` సినిమా కూడా హిట్‌గా నిలిచింది. కానీ ఈషా రెబ్బాకి పేరుని తేలేకపోయాయి. 

88

వీటితోపాటు `బందిపోటు`, `ఓయి`, `దర్శకుడు`, `బ్రాండ్‌ బాబు`, `సుబ్రమణ్యపురం`, `రాగల24గంటల్లో` చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. గతేడాది ఆమె మలయాళంలో `ఒట్టు`, తమిళంలో `నీతం ఓరు వానం` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ `అయిరామ్‌ జెన్మంగల్‌` చిత్రంలో నటిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories