దుల్కర్ సల్మాన్ 'కింగ్ ఆఫ్ కోతా' రివ్యూ

Published : Aug 24, 2023, 01:53 PM IST

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్న దుల్కర్ సల్మాన్‌ కాంపౌండ్‌ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి King Of Kotha.   

PREV
112
 దుల్కర్ సల్మాన్  'కింగ్ ఆఫ్ కోతా' రివ్యూ
King of Kotha Review


మళయాళం నుంచి వచ్చినా దుల్కర్ కు తెలుగులో  చాలా మంది స్ట్రెయిట్  హీరోల కన్నా ఎక్కువ క్రేజే ఉంది. ముఖ్యంగా సీతారామం చిత్రంతో యూత్ లోకి వెళ్లిపోయాడు. దానికి తోడు డిఫరెంట్ కథలను  సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లటం కలిసొచ్చింది. దాంతో మళయాళంతో సమానంగా తెలుగులోనూ దుల్కర్ సినిమాలు భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో  దుల్కర్.. రీసెంట్‌ క్రేజీ ప్రాజెక్టు కింగ్ ఆఫ్ కోతా(King of Kotha) మన ముందుకు వచ్చింది. ఈ సినిమా పై దుల్కర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు యాక్షన్ ఇమేజ్ వస్తుందని ఆశపడుతున్నాడు. మరి ఈ కింగ్ ఆఫ్ కోతా ..దుల్కర్ ని యాక్షన్ కింగ్ గా మార్చుతుందా..సినిమా కథేంటి..తెలుగులో వర్కవుట్ అయ్యే మేటరేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

212
king of kotha movie review


సర్కిల్ ఇన్సిపెక్టర్ సాహుల్ హాసన్(ప్రసన్న) కేరళలోని కోత టౌన్ కు ట్రాన్సఫర్ అయ్యివచ్చి  ఛార్జ్ తీసుకుంటాడు. కోత మొత్తం కన్నన్ భాయ్ (Shabeer Kallarakkal)సామ్రాజ్యం. అక్కడ డ్రగ్స్, గంజాయి యదేచ్చగా వ్యాపారం జరుగుతూంటుంది. కన్నన్ భాయ్ ని కలవటానికి వెళ్తే ఈ పోలిస్ ని దారుణంగా అవమానిస్తాడు. కొట్టి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఇక్కడ పరిస్దితులు చక్కదిద్దాలంటే కోత తిరిగి యధాస్దితికి రావాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడతాడు. అప్పుడు అతని కోలీగ్ టోనీ గతంలో కోతని దడదడలాడించిన గ్యాంగస్టర్ రాజు (దుల్కర్) స్టోరి చెప్తాడు. తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం పదేళ్ల క్రితమే కోతను వదిలి వెళ్లి ఉత్తర ప్రదేశ్ లో సెటిల్ అయ్యాడని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న సాహుల్ కు ఓ ఆలోచన వస్తుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. కన్నన్ భాయ్ ని దెబ్బ కొట్టాలంటే మళ్లీ గ్యాంగస్టర్ రాజుని తిరిగి రప్పించాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం చిన్న ప్లే చేస్తాడు.అది వర్కవుట్ అయ్యి రాజు తిరిగి కోతాకు వస్తాడు. అలా వచ్చిన రాజు ...తన ఒకనాటి బెస్ట్ ప్రెండ్  కన్నన్ భాయ్ ని దెబ్బకొడతాడా... పోలీస్ చేసిన ప్లే ఏమిటి..తిరిగి కోతా లో పరిస్దితులు యధాస్దితికి వస్దాయా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

312
king of kotha


దుల్కర్ ఇప్పటివరకు ఏ గ్యాంగ్‌స్టర్‌ సినిమా చేయలేదు. ఇది దుల్కర్ కు పెద్ద సినిమా.కొత్త సినిమా.  కింగ్ ఆఫ్‌ కోతా పాటలు, యాక్షన్‌ సీన్లు, ఫుట్‌బాల్‌ పోర్షన్లతోపాటు మరిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో ఎట్రాక్టివ్ గానే ఉంది. అలాగే టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో ఉంది. మరి ఇంకేంటి హ్యాపీకదా అంటారా.. అయితే సినిమా అంతా బాగా స్లో నేరేషన్ తో ..ముందుకు కదులుదామా వద్దా  అన్నట్లు నీరసంగా  కదులుతూంటుంది. సినిమాలో విలన్ ...స్ట్రాంగ్ గా ఉండదు. హీరోని చూస్తేనే ఆ విలన్ భయపడిపోతూంటాడు. అలాంటప్పుడు కథలో కాంప్లిక్ట్స్ ఎక్కడుంటుంది. పోనీ హీరో లవ్ స్టోరీ అయినా సరిగ్గా ఉందా అదీ సజావుగా ఉండదు. అడగడుకీ భారీ ఫైట్స్ పెట్టారు. ఎమోషన్ లేని ఫైట్స్ ఎంతవరకూ కనెక్ట్ అవుతాయి.  ఫస్టాఫ్ మొత్తం హీరో  ఫ్లాష్ బ్యాక్. అది పూర్తి ఇయ్యి ఇంటర్వెల్ వచ్చినా  కథ కొంచెం కూడా కదలదు. పోనీ సెకండాఫ్ లో అసలైన సినిమా  ఉంటుంది ..అనుకుంటాం. హీరో తిరిగి కోతాకు వచ్చాడు. ఇప్పుడు విలన్ ని దడదడలాడిస్తాడు అనుకుంటాం. కానీ అంత సీన్ ఏమీ ఉండదు. ఏవో సీన్స్ వస్తూంటాయి. పోతూంటాయి. విలన్, హీరో కూర్చుని తాము ఒకప్పటి స్నేహితులం కదా అని  కబుర్లు చెప్పుకుంటూ మందు కొడుతూంటారు.

412
king of kotha


 అలాగే హీరో అంటే తనకు భయం అని విలన్ చెప్పి దూరంగా ఉంటూంటాడు, తన మనష్యులను కూడా వాడికి దూరంగా ఉండండి అని చెప్తూంటారు. అంతేకాదు పుష్ప సినిమాలో సునీల్ ట్రాక్  లాగ ...విలన్ భార్య తమ్ముడు చనిపోవటం...అక్కడ నుంచి ఆమె నువ్వు హీరోని చంపి తీసుకురా అని అరవటం..చేతకానివాడివని తిట్టడం, వార్నింగ్ లు ఇవ్వటం. ఇక ఈ పోటు భరించలేక విలన్ ..హీరోని   చంపటానికి వేరే వాళ్లని పురమాయిస్తాడు. అది చూసి విలన్ తో తిరిగే వాళ్లు హర్ట్ అయ్యి..మమ్మల్ని పంపలేదే అంటే...మిమ్మల్ని కోల్పోవటం నాకు ఇష్టం లేదురా అంటాడు (అది వినగానే మనకు అవును అసలే జనం పనులుకు దొరకటంలేదు..ఉన్నవాళ్లను పోగొట్టుకుంటే ఎలా అన్నట్లు అనిపిస్తుంది. 

512
king of kotha


సెకండాఫ్ లో ఓ చోట  విలన్, హీరో ఎదురెదురు పడతారు. హమ్మయ్య ..ఇక్కడితో ఈ సినిమా పూర్తైపోతుంది అని ఆనందంతో మనం ఆ ఫైట్ చూడటానికి రెడీ అయ్యిపోతాం.  విలన్ ..హీరో మీదకు వచ్చేస్తూంటాడు. మనలో ఆనందం .కానీ అప్పుడే కొట్టేసుకుంటే ఎలా ...ఇంకా చాలా సినిమా ఉంది అని డైరక్టర్ చెప్పినట్లుగా ... విలన్ ని అతని మనుష్యులు వెనక్కి లాగేసి బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లిపోతారు. అక్కడ నుంచి మరో అరగంట సినిమా ఉంటుంది. అక్కడే కొట్టేసుకుంటే కథ అయ్యిపోయేది కదా అని మనకు బాధ కలుగుతుంది. 

612
king of kotha

ఈ కథలో చాలా సబ్ ప్లాట్స్, Multiple థ్రెడ్స్ పెట్టుకున్నారు. అవి ప్రారంభంలో ఇంట్రస్టింగ్ గా అనిపించినా...వాటి ముగింపులు మాత్రం ఎన్నోసార్లు చూసిందే మనకు తెలిసిందే కావటం కొంత ఇబ్బంది. స్లో గా చెప్తే బాగా రిజిస్టర్ అవుతుంది అని డైరక్టర్ అనుకుని ఉండవచ్చు కానీ ..చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ  జరగనప్పుడు ఇలాంటి   గ్యాంగస్టర్ కథలు స్క్రీన్ ప్లే అయినా రేసిగా ఉండాలి. లేకపోతే వాటి స్లోనెస్ చూసి మనకు బయిటకు పరుగెట్టాలనిపిస్తుంది.  ఇది చాలదన్నట్లు చివర్లో సీక్వెల్ కి లీడ్ ఇస్తాడు. ,సినిమాలో కామెడీ లేదే అనుకుంటాం కానీ చివర్లో ఇంత పెద్ద జోక్ పెట్టాడని అర్దం చేసుకుంటాం. 

712
Dulquer salmaan

ఈ సినిమాతో పరిచయమైన దర్శకుడు  అభిలాష్ స్క్రిప్టు చేసుకోవటంలో పూర్తిగా తడబడటమే సినిమాని దెబ్బ కొట్టింది. స్నేహం, ద్రోహం, ప్రతీకారం పాయింట్ తో కథ రాసుకున్నాడు కానీ అవన్నీ ఇంతకు ముందు చూసేసినట్లు అనిపిస్తాయి. గ్యాంగస్టర్ ఫిల్మ్ కదా అని మాస్ ఎపిసోడ్స్ ఎక్సపెక్ట్ చేస్తాం. కానీ అవేమీ కనపడవు. అయితే ఇంత బోర్ లోనూ చివరిదాకా కూర్చోబెట్టేది నిమిలేష్ రవి విజువల్స్  అదిరిపోయాయి. స్లోమోషన్ షాట్స్ & క్యారెక్టర్ ఇంట్రడక్షన్ షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. ఇక  జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్...జైలర్ అనిరిధ్ ని గుర్తు చేస్తుంది. అలాగే ఎనభైల నాటి వాతావరణం క్రియేట్ చేసే సెట్ డిజైన్స్. విజువల్ గా మంచి ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ ఎలా ఉన్నా..ఓ అరగంట తీసేస్తే మూడు గంటల లెంగ్త్ అయినా తగ్గేది.

812
king of kotha

ఈ సినిమా దుల్కర్ సల్మాన్ వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకు మిగతా ఆర్టిస్ట్ లు పెద్దగా పరిచయం లేకపోవటం కూడా ఆ ఫీల్ కలగచేస్తుంది. దుల్కర్ స్టైల్, స్వాగ్ మనని స్క్రీన్ నుంచి దృష్టి మరల్చవు. గోకుల్ సురేష్ కూడా అద్బుతం అనిపిస్తాడు. విలన్ గా వేసిన షబ్బీర్,  హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య లక్ష్మి గుర్తుండిపోయే పాత్రలు. రంజన్ గా చంబన్ వినోద్ అయితే మామూలుగా చేయలేదు
   

912
King of Kotha

దుల్కర్ సల్మాన్
డైలాగులు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కెమెరా వర్క్

ఎనభైల కాలం గుర్తు చేసే ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్

1012
King of Kotha second look



మూడు గంటల సుదీర్గంగా సాగిన సినిమా లెంగ్త్
డెడ్ స్లో పేస్ లో నడిచే సీన్స్ 
ట్విస్ట్ లు,టర్న్ లు లేకుండా ప్లాట్ గా ప్రెడిక్టబుల్ గా సాగటం

1112
Dulquer salmaan

  
 

ప్రముఖ మళయాళ డైరక్టర్ జోషి గారి అబ్బాయి డైరక్టర్ కదా అని ఆవేశపడితే ఈ సినిమా అంత సీన్ లేదని వెక్కిరిస్తుంది.    'కింగ్ ఆఫ్ కోతా'..కాదు రోత అని విసుగొస్తుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2 

1212
King of Kotha

ఎవరెవరు...


బ్యానర్స్ : జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిలింస్‌
తారాగణం:  దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, డ్యాన్స్ రోజ్ షబీర్,  ప్రసన్న, నైల ఉషా, గోకుల్ సురేష్ తదితరులు.
సంగీతం : జేక్స్ బిజోయ్ , షాన్ రెహమాన్
సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి
ఎడిటింగ్: శ్యామ్ శశిధరన్,
కాస్ట్యూమ్ డిజైన్: ప్రవీణ్ వర్మ,
 దర్శకత్వం: అభిలాష్ జోషి
రిలీజ్ డేట్: ఆగస్ట్ 24, 2023

click me!

Recommended Stories