భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 నేడు విజయవంతం అయింది. యావత్ దేశం గర్వించేలా.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు తొంగి చూసేలా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని సాఫ్ట్ గా ముద్దాడింది. దీనితో సినీ రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, విద్యావేత్తలు అన్ని రంగాల వారు ఇస్రో సాధించిన ఘనతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.