దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మరో థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీలో బిజూ మీనన్, జోజూ జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మూవీ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
డైరెక్టర్ జీతూ జోసెఫ్ దృశ్యం సిరీస్ తో బాగా పాపులర్ అయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఆయన కొత్త ఒరవడి సృష్టించారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న దృశ్యం 3పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈలోపు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా పేరు వలతు వషత్తే కల్లన్(Valathu Vashathe Kallan).
25
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
ఈ చిత్రంలో జోజు జార్జ్, బిజూ మీనన్, నిరంజన అనూప్ ప్రధాన పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ సినిమా అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి కొదవ ఉండదు. ఈ చిత్రం కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేసే విధంగా ఉంటుంది. అయితే జీతూ జోసెఫ్ గత చిత్రాల రేంజ్ లో అయితే లేదు. ఓటీటీలో చూసే మాత్రం మంచి టైం పాస్ అనే చెప్పాలి. ఈ మూవీ మలయాళంలో థియేటర్స్ లో రిలీజైనప్పుడు ఆకట్టుకోలేకపోయింది.
35
థియేటర్స్ లో నష్టాలు
భారీ స్థాయిలో నష్టాలని మిగిల్చింది అట ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలని ఇష్టపడేవారు ఈ మూవీని మిస్ కాకుండా చూడవచ్చు.
ఈ సినిమా కథని గమనిస్తే దర్శకుడు జీతూ జోసెఫ్.. బ్యూరీడ్ అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందించినట్లు అనిపిస్తుంది. ఆ సినిమా ప్రభావం వలతు వషత్తే కల్లన్ పై ఉన్నప్పటికీ జీతో జోసెఫ్ తనదైన స్టయిల్ లో మర్డర్ ఇన్వెస్టిగేషన్, ట్విస్టులు పెట్టారు. కథ విషయానికి వస్తే.. జోజూ జార్జ్ ఒక ఎథికల్ హ్యాకర్ గా ఉంటారు. తన ఇంట్లో కూతురు, భార్యతో సంతోషంగా జీవిస్తుంటాడు. అతడి కూతురు లా స్టూడెంట్.
55
ఇన్వెస్టిగేషన్ సీన్స్ అదుర్స్
ఆమె సమాజంలో జరిగే అక్రమాలపై పోరాటం చేస్తూ ఉంటుంది. పొలిటీషియన్ కొడుకు ఒకడు ఓ అమ్మాయి మరణానికి కారణం అవుతాడు. అతడిని కాపాడేందుకు అవినీతి పరుడైన పోలీస్ అధికారిగా బిజూ మీనన్ కనిపిస్తారు. వీరందరిపై జోజూ జార్జ్ కూతురు పోరాడుతూ ఉంటుంది. ఒక రోజు ఆమెని కూడా చంపేస్తారు. తన కూతురిని చంపిన వారిని జోజూ జార్జ్ ఎలా కనుగొన్నాడు ? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఉత్కంఠని కలిగించేలా ఉంటాయి. బిజూ మీనన్, జోజూ జార్జ్ పోటాపోటీగా నటించారు.