ఈ మధ్య కాలంలో జబర్దస్త్ సంక్షోభంలో పడింది. జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రోజా,అనసూయ దూరమయ్యారు. అలాగే అనేక మంది జబర్దస్త్ కమెడియన్స్ ఇతర ఛానల్స్ కి వెళ్లిపోయారు. స్టార్స్ దూరమైన కారణంగా జబర్దస్త్ రేటింగ్ తగ్గింది. ప్రస్తుతం షోలో ఉన్న కమెడియన్స్ ఒక్కప్పటి స్థాయి కామెడీ చేయలేకపోతున్నారు.