సొసైటిలో ఉన్న అనేక అపోహలు, మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యలపై స్పందించేందుకు ముందుకు వస్తూంటుంది మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్. ఈ క్రమంలోనే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యం గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్ షోలో భాగంగా మాట్లాడిందామె. చిన్న వయసు నుంచే ఈ అంశంపై పిల్లల్లో అవగాహన పెంచాలని ఈతరం తల్లిదండ్రులకు సలహా ఇస్తున్న సుస్మిత.. ఇంట్లో తనకు, తన పిల్లలకూ మధ్య ఈ టాపిక్ తరచూ చర్చకు వస్తుందని చెప్పుకొచ్చింది. అందులో భాగంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
“నేను నా కూతుళ్లుకు సెక్స్ గురించి ఎక్సప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లు ఆల్రెడీ PhD చేసారు.” అన్న ఆమె మాటలను వైరల్ చేస్తున్నారు. అయితే ఆమె వాటిని ఏ కంటెస్ట్ లో అన్నారనేది చాలా మంది పట్టించుకోవటం లేదు. సుస్మితాసేన్ ఇలా కామెంట్ చేసిందేంటి అని విమర్శలు గుప్పిస్తున్నారు.
మరికొందరు నెటిజన్లు అయితే బాలీవుడ్ సెక్స్ ఎడ్యుకేషన్ ని పిల్లల మీద మాసివ్ మార్కటింగ్ ద్వారా రుద్దుతున్నారు. ఇల్లీగల్ ఏక్టివిటీస్ తో ఇవి లింక్ ఉంటున్నాయి. వాళ్లకు ప్రెస్టేజియస్ ఇన్ఫూలియన్స్ అవార్డ్ లు కూడా వస్తున్నాయి అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
వేరొకరు...సుస్మితాసేన్ ని విమర్శిస్తూ..సుస్మిత...తరుచుగా బోయ్ ప్రెండ్స్ ని మారుస్తూంటుంది. ఆ రకంగా తన కూతుళ్లకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తూంటుందని క్రిటిసైజ్ చేసాడు. ఇలాంటి రకరకాల రియాక్షన్స్ ఆమె కామెంట్స్ పై వస్తున్నాయి.
అయితే అసలు సుస్మిత ఏమంది... ‘మన సమాజంలో లైంగిక అంశాల గురించి బహిరంగంగా మాట్లాడడం తప్పుగా భావిస్తుంటారు. కానీ 90ల్లోనే మా అమ్మ, నేను ఈ టాపిక్ గురించి చాలా ఓపెన్‌గా చర్చించుకునేవాళ్లం. అప్పుడు నాకు 14-15 ఏళ్ల వయసుంటుందనుకుంటా. నాకొచ్చిన సందేహాల్ని మా అమ్మను నిర్మొహమాటంగా అడిగేదాన్ని. తనూ ఎంతో సున్నితంగా, ఓపిగ్గా నాకు సమాధానమిచ్చేది.. అందుకే ఈ అంశం గురించి బహిరంగంగా మాట్లాడడానికి నేనెప్పుడూ సిగ్గుపడను.
అంతేకాదు.. ఇదే పేరెంటింగ్ స్టైల్‌ని నా పిల్లల విషయంలోనూ అనుసరిస్తున్నా. అయితే మా అమ్మకు, నాకు మధ్య జరిగిన చర్చల్లా కాకుండా ఈ తరానికి తగినట్లుగా నా ఇద్దరు కూతుళ్లతో ఈ అంశం గురించి చర్చిస్తుంటా.
మా పిల్లలుకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎక్సప్లెయిన్ చేయాల్సిన పని లేదు. వాళ్లు ఆల్రెడీ PhDs చేసేసారు. ఇక మా చిన్నమ్మాయి అలీసాకు దీనిపై మరింత అవగాహన ఉంది. ఎందుకంటే తను బయాలజీ స్టూడెంట్. అయినా ఈ అంశంపై ఇంట్లో చాలా సాధారణంగా మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరికీ ఈ విషయంలో తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది.. కాబట్టి ఇందులో అసౌకర్యంగా ఫీలవ్వాల్సిందేమీ లేదు.. పైగా ఇలా చిన్న వయసు నుంచే పిల్లలకు లైంగిక విద్యపై అవగాహన కల్పించడం వల్ల ఏది మంచో, ఏది చెడో వాళ్లు తెలుసుకోగలుగుతారు.. తద్వారా తప్పటడుగు వేసే ప్రమాదం ఉండదు..’ అంటోందీ సుస్మిత సేన్.