Raayan Review
ధనుష్ హీరోగా పరిశ్రమలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ధనుష్ కెరీర్ బిగినింగ్ లో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఇతడు ఎలా హీరో అని అవమానించారు. ఆ విమర్శలకు చెక్ పెడుతూ ధనుష్ గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగిన ధనుష్ 50 చిత్రాలు పూర్తి చేశాడు.
Raayan Review
ధనుష్ తన 50వ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. ధనుష్ కెరీర్లో మైలురాయి చిత్రంగా తెరకెక్కిన రాయన్ విడుదలైంది. ఈ చిత్రం ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, దసరా విజయ్ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. రాయన్ ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. మూవీ టాక్ ఎలా ఉందో చూద్దాం..
Raayan Review
ఓ ప్రాంతంలో సాగే ఆధిపత్య పోరే రాయన్ మూవీ. ధనుష్ కి ప్రత్యర్థిగా ఎస్ జె సూర్య నటించాడు. ధనుష్ కి చెక్ పెట్టాలని ముగ్గురు నలుగురు ప్రత్యర్ధులు ఒకటి అవుతారు. మరి ధనుష్ వారిని ఎదిరించి ఎలా నిలబడ్డాడు అనేది కథ. ఆడియన్స్ అభిప్రాయంలో రాయన్ ఫస్ట్ హాఫ్ బాగుంది. ధనుష్ నటన, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
Raayan Review
ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. సెకండ్ హాఫ్ కి మంచి సెటప్ కుదిరింది అని ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు . రాయన్ మూవీలో సందీప్ కిషన్ ఓ కీలక రోల్ చేయడం విశేషం. ఆయన పాత్ర సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు. ధనుష్, సందీప్ కిషన్ కాంబో సీన్స్ మెప్పిస్తాయని సోషల్ మీడియా టాక్.
Raayan
నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ధనుష్ సక్సెస్ అయ్యాడన్న మాట వినిపిస్తోంది. ధనుష్ డైరెక్షన్ స్కిల్స్ అద్భుతం అంటున్నారు. ధనుష్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది. ఎప్పటిలాగే ఎస్ జె సూర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎస్ జే సూర్య పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుందని అంటున్నారు.
Raayan
రా అండ్ రస్టిక్ రోల్ లో ధనుష్ మరోసారి అద్భుతం చేశాడు. గుండు చేయించుకుని ధనుష్ డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. మూవీలో కీలక రోల్స్ చేసిన నటులు, వారి పాత్రలు చక్కగా కుదిరాయని ఆడియన్స్ అభిప్రాయం. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ కమ్ బ్యాక్ అయ్యారు. ఆయన మ్యూజిక్ చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా రాయన్ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పూర్తి రివ్యూ చూస్తే కానీ మూవీ ఫలితం ఏమిటో అంచనా వేయలేం..