ప్రభాస్ 'స్పిరిట్' ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇది గమనించారా.? గుర్తిస్తే మైండ్ పోతుంది..

Published : Jan 06, 2026, 09:00 AM IST

Prabhas: ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిప్తి దిమ్రి హీరోయిన్ కాగా.. కాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ న్యూఇయర్ రోజున విడుదలైంది. 

PREV
15
స్పిరిట్ మూవీ..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'స్పిరిట్'. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ మూవీ తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే.

25
సందీప్ వంగా హీరోలు..

అర్జున్ రెడ్డి నుంచి చూస్తుంటే.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హీరోలు కొంచెం డిఫెరెంట్‌గా ఉంటారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగా.. ఇక అతడి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ రఫ్ అండ్ ఊరమాస్ లెవెల్‌లో ఉంటుంది. ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

35
కీలక నటులు ప్రధాన పాత్రల్లో..

ఈ మూవీలో ప్రభాస్‌కు జోడిగా యానిమల్ ఫేం త్రిప్తి డిమ్రి నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటి కాజోల్ కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్. సీరియస్ కాప్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

45
ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, రూమర్స్..

సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందుకు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో డార్లింగ్ అభిమానులు హల్చల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. న్యూఇయర్ కానుక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే.

55
ఇది గమనించారా..

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఉండగా.. అతడికి సిగరెట్ వెలిగిస్తూ హీరోయిన్ త్రిప్తి దిమ్రి కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ చేతిలో మందు బాటిల్‌ను కూడా మీరు గమనించవచ్చు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ అయిన వాయిస్‌లో ప్రభాస్‌ని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్టు.. ప్రకాష్ రాజ్ మాట్లాడినట్టు రివీల్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. టార్చర్ చేసి ప్రభాస్‌ను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వచ్చే సీన్‌లా అనిపిస్తోందని అభిమానులు అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories