కాజల్ అగర్వాల్ సినిమా వ్యవహారాలన్నీ చూసేది ఎవరో తెలుసా? ఇన్నేళ్లుగా ఆవిడే చూస్తున్నారా!

First Published | Jul 22, 2023, 4:57 PM IST

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులకు తెలియజేస్తూ ఆకట్టుకుంటున్నారు. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్  (Kajal Aggarwal)  దాదాపుగా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమె సినిమా వ్యవహారాలన్నీంటిని చూసేది ఆమెనంటూ తాజాగా చందమామ రివీల్ చేసింది. 
 

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే సెపరేట్ ఫ్యాన్ బేస్ నూ క్రియేట్ చేసుకుంది. 
 


తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించిన కాజల్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక అభిమానం సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ కేరీర్ లో మొదటి నుంచి అంతకంతకూ ఎదుగుతూ వచ్చింది. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ వచ్చింది. అందుకే చాలా హిట్ సినిమాల్లో నటించగలిగింది.
 

అయితే, కాజల్ అగర్వాల్ సినిమా వ్యవహారాలన్నీ ఎవరు చూస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనికి కాజల్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది. వాళ్ల అమ్మనే తన సినిమాల విషయాలను చూసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు తన సినిమాలన్నీ ఆవిడే చూశారని చెప్పింది. 

ఇక కాజల్ అగర్వాల్ అమృత్‌సర్‌లోని పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డారు. ఆమె తండ్రి వినయ్ అగర్వాల్, వస్త్ర వ్యాపారి. ఇక తల్లి సుమన్ అగర్వాల్ మిఠాయి వ్యాపారిగా ఉన్నారు. కాజల్ సినిమా  వ్యవహారాలన్నింటీని ఆవిడే డీల్ చేయడంతో పాటు, కాజల్ వ్యాపారాలను కూడా చూసుకుంటారు. 
 

రెండేళ్ల కింద కాజల్ ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును  పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది పండంటి మగబిడ్డకూ జన్మిచ్చింది. పేరు నీల్ కిచ్లు. ప్రస్తుతం కాజల్ తెలుగులో బాలయ్య సరసన ‘భగవంత్ కేసరి’, ‘సత్యభామ’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ తో ’ఇండియన్ 2’ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలో ‘ఉమా’ అనే సినిమా కూడా చేస్తోంది. 
 

Latest Videos

click me!